PM Modi for Nobel Prize: అది తప్పుడు వార్త..
నోబెల్ శాంతి పురస్కారం (Nobel peace Prize) ప్రకటించడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేరును నోబెల్ కమిటీ పరిశీలిస్తోందన్న వార్తలు పూర్తిగా అబద్ధమని, నిరాధారమని నోబెల్ కమిటీ సభ్యుడు ఆస్లే టోజ్ (Asle Toje) స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదనేదీ కమిటీ వద్ద లేదని తేల్చి చెప్పారు. అది పూర్తిగా ఫేక్ (fake) వార్త అన్నారు. అలాంటి వ్యాఖ్య కానీ, అలాంటి వ్యాఖ్యతో సంబంధమున్న ఎలాంటి ట్వీట్ (tweet) కానీ ఏదీ తాను చేయలేదని వివరణ ఇచ్చారు. నోబెల్ శాంతి పురస్కారం (Nobel peace Prize) కోసం మోదీ (PM Modi) పేరును పరిశీలిస్తున్నరని ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ట్వీట్ ఫేక్ అని, అసలు ఆ వార్తపై డిస్కస్ చేసి, ఆ తప్పుడు వార్తకు మరింత ప్రాచుర్యం కల్పించవద్దని నోబెల్ కమిటీ సభ్యుడు ఆస్లే టోజ్ (Asle Toje) సూచించారు.