యూనియన్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్..

మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం తమ కస్టమర్లకు సేవింగ్స్ ఖాతాలపై మంచి వడ్డీ రేటును అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.50 లక్షల డిపాజిట్ల మీత 2.75 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు డిపాజిట్లపై రూ.2.90 శాతం వడ్డీ అందిస్తోంది. అలాగే రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్లపై 3.10 శాతం వడ్డీ ఇస్తుండగా.. రూ.500 కోట్లకుపైగా ఉండే డిపాజిట్లకు వార్షిక వడ్డీగా 3.40 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అలాగే రూ.1000 కోట్లు ఆపైన డిపాజిట్లు ఉంటే రూ.3.55 శాతం వడ్డీ ఇస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచిన క్రమంలో రుణాలపై రేట్లను పెంచుతూనే డిపాజిట్లను ఆకర్షించే చర్యలు చేపట్టింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. పొదుపు ఖాతాపై రూ.10 లక్షల వరకు ఉన్న డిపాజిట్లపై 2.70 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అలాగే రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉన్న డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ అందిస్తోంది. ఇదే సమయంలో రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న డిపాజిట్లపై 3 శాతానికిపైగా వడ్డీ ఇస్తోంది ప్రభుత్వం రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్.
ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా..

ప్రైవేటు రంగంలోని మరో దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ. ఈ బ్యాంకులో పొదుపు ఖాతా కలిగి ఉండి నగదు నిల్వ ఉంచినట్లయితే మంచి వడ్డీ వస్తుంది. ఈ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో రూ.50 లక్షల వరకు ఉన్న డిపాజిట్లపై 3 శాతం మేర వడ్డీ అందిస్తోంది. అలాగే రూ.50 లక్షల కంటే ఎక్కవ మొత్తంలో నగదు నిల్వ ఉన్నట్లయితే ఆయా డిపాజిట్లపై 3.50 శాతం మేర వడ్డీ ఇస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ సైతం మూడు నెలలకు ఒకసారి వడ్డీని లెక్కగడుతుంది. వచ్చిన వడ్డీని కస్టమర్ల బ్యాంక్ ఖాతాల్లో ఎప్పటికప్పుడు జమ చేస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

దేశంలోని ప్రైవేటు రంగంలని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీఐ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలపై మంచి వడ్డీ వస్తుంది. ఈ బ్యాంకులో పొదుపు ఖాతా కలిగి ఉండి రూ.50 లక్షల కంటే తక్కువ విలువైన డిపాజిట్లు కలిగిన ఉన్న కస్టమర్లకు 3 శాతం వడ్డీ వస్తుంది. అలాగే రూ.50 లక్షల కంటే ఎక్కువగా నగదు ఖాతాలో ఉన్నట్లయితే ఆయా నగదుపై 3.50 శాతం మేర వడ్డీ చెల్లిస్తుంది హెచ్‌డీఎఫ్‌సీఐ. ఈ బ్యాంకు సైతం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని లెక్కగట్టి ఖాతాలో జమ చేస్తుంది. ఇతర డిపాజిట్లపైనా మంచి వడ్డీ అందిస్తోంది ఈ ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం సేవింగ్స్ ఖాతాలపై మంచి వడ్డీ రేటును అందిస్తోంది. రూ.10 కోట్లు వరకు ఉన్న పొదుపు ఖాతాల డిపాజిట్లపై 2.70 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే రూ.10 కోట్లకుపైగా ఉన్న డిపాజిట్లపై 3 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించి బ్యాంకు కస్టమర్ల ఖాతాల్లో జమ చేస్తుంది ఎస్‌బీఐ. ఖాతాలో నగదు నిల్వ ఉంచితే సరిపోతుంది. కస్టమర్లు ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు వడ్డీ లెక్కించి ఖాతాలో జమ చేస్తుంది బ్యాంక్.