Friday, March 24, 2023

Nani: అదొక పీడ‌క‌ల‌.. రెండు నెల‌లు స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌లేదు: నాని

Nani: నేచుర‌ల్ స్టార్ నాని పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తోన్న తొలి ప్ర‌య‌త్నం ‘దసరా’. మార్చి 30న తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మూవీ రిలీజ్ అవుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్‌. శ్రీకాంత ఓదెల దర్శ‌కుడు.ఇప్ప‌టి వ‌ర‌కు నాని చేయ‌న‌టువంటి రా లుక్‌తో ద‌స‌రా సినిమాలో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ద‌స‌రా సినిమాను నార్త్ ఇండియా స‌హా భారీ ఎత్తున ప్ర‌మోట్ చేయ‌టంలో నేచుర‌ల్ స్టార్ బిజీగా ఉన్నారు.

ఈ ద‌స‌రా సినిమా కోసం నాని ప‌డ్డ క‌ష్టం మామూలుగా లేదు. ఎందుకంటే లుక్ విష‌యం నుంచి ప్ర‌తీ విష‌యంలోనూ డిఫ‌రెంట్ ప్యాట్ర‌న్‌లో వెళుతూ చేసిన సినిమా. ఈ మూవీ ఆయ‌న‌కు ఓ విష‌యంలో మాత్రం మ‌రచిపోలేని చేదు జ్ఞాప‌కాన్ని మిగిల్చింద‌ట‌. చాల పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌పడ్డార‌ట నాని. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంత‌కీ ఏం జ‌రిగింద‌నేది నాని మాట‌ల్లోనే ‘‘ఓరివారి పాట‌ను షూట్ చేస్తున్న‌ప్పుడు నేను కోల్ ఉన్న లారీలోకి ఎక్కుతాను. వాళ్లు కోల్ లారీ నుంచి పోస్తుంటే దాంతో పాటు కింద‌కు రావాలి. అది సీన్‌.

ఒరిజినల్ కోల్ ప్లేస్లో సింథ‌టిక్‌తో కోల్‌ను రెడీ చేశారు. డంప‌ర్ ట్ర‌క్‌లో చాలా డ‌స్ట్ కూడా ఉండింది. డంప‌ర్ ట్ర‌క్ పైకి ఎక్కి కోల్‌తో పాటు కిందుకు జారేట‌ప్పుడు నాపైన కోల్‌, డ‌స్ట్ అంతా ప‌డిపోయింది. డంప‌ర్ ట్ర‌క్ అంటే ఎంత సింథటిక్ కోల్‌, డ‌స్ట్ ఉంటుందో అర్థం చేసుకోండి. దాంట్లో నుంచి బ‌య‌ట‌కు లాగేట‌ప్ప‌టికీ ఊపిరి తీసుకునే క్ర‌మంలో డ‌స్ట్ అంతా లోప‌లికి వెళ్లిపోయింది. అదంతా పీడ కల అని అనుకోవాలంతే. ఆ దెబ్బ‌కు రెండు నెల‌లు నిద్ర ప‌ట్టేది కాదు. లోపల ఏదో డిస్ట్ర‌బెన్స్ ఉన్న ఫీలింగ్ ఉండేది. మెల్ల‌గా క్లియ‌ర్ అయ్యింది’’ అన్నారు.

ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమా. గోదావ‌రి ఖ‌ని బొగ్గు గ‌నికి ద‌గ్గ‌రగా ఉండే ప‌ల్లెటూళ్లో జ‌రిగే క‌థాంశంగా సినిమాను డైరెక్ట్ చేశారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, నాని లుక్ అన్ని సినిమాపై మంచి అంచనాల‌నే పెంచాయి. మ‌రి సినిమా ఎలాంటి స‌క్సెస్‌ను అందుకుంటుంద‌నేది తెలియాలంటే మార్చి 30 వ‌ర‌కు ఆగాల్సిందే.

ALSO READ: Balakrishna: ద‌టీజ్ బాల‌కృష్ణ‌.. ఏ స్టార్ హీరో చేయ‌ని ప్ర‌యోగం.. స్టేజ్‌పై ర్యాప్ షో
ALSO READ: Ananya Pandey: సిగ‌రెట్ తాగుతూ అడ్డంగా దొరికిన లైగ‌ర్ బ్యూటీ అనన్య పాండే.. నెటిజ‌న్స్ ట్రోల్స్‌
ALSO READ: Samantha: ప‌సుపుతాడు..న‌ల్ల పూస‌ల‌తో స‌మంత‌.. రెండో పెళ్లి చేసుకుందా? .. ఫొటో వైర‌ల్‌

Latest news
Related news