DLF: భారతదేశంలోని అతిపెద్ద లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్ (DLF) లగ్జరీ హైరైజ్ నివాసాలైన ది ఆర్బన్ (The Arbour) రూ.8 వేల కోట్లకుపైగా ప్రీ- ఫార్మల్ లాంఛ్ అమ్మకాలతో రికార్డు క్రియేట్ చేసింది. సంస్థ ఈ కాంప్లెక్స్‌ను గురుగ్రామ్‌లోని DLF సెక్టార్ 63 గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్‌లో నిర్మిస్తోంది. అధికారికంగా ఇంకా ప్రాజెక్ట్ ప్రారంభించక ముందే ఈ దిగ్గజ రియాల్టీ కంపెనీ ఫ్లాట్లను పూర్తిగా విక్రయించడం విశేషం. ఈ ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంపన్న పరిసర ప్రాంతంలో 38 లేదా 39 అంతస్తులు ఉండే విధంగా మొత్తం 5 నిర్మాణాలను కంపెనీ ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టనుంది.
మొత్తంగా ఈ ఐదు నిర్మాణ సముదాయాల్లో 1137 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లాట్‌లో నాలుగు బెడ్ రూమ్స్, స్టడీ రూమ్, యుటిలిటీ రూమ్ ఉంటాయి. ఇక ఒక్కో ఫ్లాట్ ధర రూ. 7 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇక మొత్తంగా ఇప్పటికే రూ.8 వేల కోట్ల మేర సేల్స్ పూర్తి చేయడం విశేషం.
ది ఆర్బర్ ప్రాజెక్ట్ ప్రారంభించక ముందే.. మంచి స్పందన వస్తోందని చెప్పారు DLF లిమిటెడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాశ్ ఓహ్రీ. దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది లగ్జరీ రియల్ ఎస్టేట్ విభాగంలోనే బహుశా కొత్త టచ్‌స్టోన్ కావొచ్చని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో దాదాపు 95 శాతం కొనుగోలుదారులు.. తమ నివాసాల కోసమే ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.
Hyderabad జూబ్లీహిల్స్ Plots కు కళ్లుచెదిరే ధర.. అక్కడ Properties అమ్ముకున్న జీవీకే రెడ్డి.. ఆ మహిళా వ్యాపారి సొంతం!
బాబోయ్.. Hyderabad Hitech City లో నెలకు ఇంత రెంట్ కట్టాలా? ఎక్కడెక్కడ Rents ఎలా ఉన్నాయంటే?
రియల్ ఎస్టేట్ జోరు.. Hyderabad చుట్టూరా ఉన్న Plots కొంటున్నారా? ఇలా మోసాలు చేస్తున్నారు జాగ్రత్త..