Friday, March 31, 2023

Food For Strong Bones: మీ ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ ఆహారం కచ్చితంగా తినాలి..!

Food For Strong Bones: ఎముకలు లేని శరీరాన్ని ఊహించలేం. శరీరం నిర్మాణం మొత్తం ఎముకలపై ఆధారపడి ఉంటుంది. ఎముకలే లేకపోతే శరీరం ముద్దలా మారి, కుప్పకూలుతుంది. మనం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం. లేదంటే అవి తేలికగా అరగటం, చిన్న దెబ్బలకే విరగుతాయి. ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. తర్వాత పరిణామాలు చవిచూడాల్సి వస్తోంది. ఈ రోజుల్లో, చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం.. వంటి కారణాల వల్ల ఎముకల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. కొంతమందికి చిన్నవయసులోనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం లేకపోవడం. ఆహారంలో తగినంత క్యాల్షియం లేకపోయినా, శరీరం క్యాల్షియంను గ్రహించలేకపోయినా ఎముకలు బలహీనమవుతాయి. ఎముకల ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి.. రోజుకు కనీసం 1000 mg కాల్షియం తీసుకోవాలని పోషకాహార నిపుణురాలు, డైటీషియన్‌ అంజలి ముఖర్జీ అన్నారు. మన శరీరంలో కాల్షియం శోషణకు మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ డి వంటి ఇతర పోషకాలు అవసరమని సూచించారు. మన శరీరంలో కాల్షియం లోపం కారాణంగా రికెట్స్‌, ఆస్టియోపోరోసిస్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. , డైటీషియన్‌ అంజలి ముఖర్జీ మనకు వివరించారు.

క్యారెట్‌, పాలకూర జ్యూస్‌..

క్యారెట్‌, పాలకూర జ్యూస్‌..

క్యారెట్‌, పాలకూర జ్యూస్ తరచుగా తీసుకుంటే.. ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయని పోషకాహార నిపుణురాలు, డైటీషియన్‌ అంజలి ముఖర్జీ అన్నారు. మీరూ ఈ జ్యూస్‌ తయారు చేయడానికి.. 6 క్యారెట్లు, 50 గ్రాముల పాలకూర బ్లెండర్‌లో తీసుకుని నీరు పోసి.. బ్లెండ్‌ చేయాలి. ఈ జ్యూస్‌ నుంచి దాదాపు.. 300 మిల్లీగ్రాముల కాల్షియం పొందవచ్చు. ఈ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి.

పప్పులు..

పప్పులు..

రోజూ మీ డైట్‌లో.. పప్పు తీసుకుంటే మీ ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. కిడ్నీ బీన్స్, శనగ పప్పు, కందిపప్పు, పెరసర పప్పు ఎక్కువగా తీసుకోవాలి. 100 గ్రాముల పప్పు తీసుకుంటే.. మీకు దాదాపు 200 నుంచి 250 మిల్లీగ్రాముల కాల్షియం పొందవచ్చు.

నవ్వులు..

నవ్వులు..

మీరు రోజూ రెండు మూడు టీస్పూన్ల నువ్వులు తింటే.. 1400 mg కాల్షియం పొందవచ్చు. నువ్వులను బెల్లంతో కలిపి కూడా తీసుకోవచ్చు. మీ కూరల్లో, పచ్చళ్లలో నవ్వులు వేసుకుని డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నువ్వుల్లో రాగి, మెగ్నీషియం, కాల్షియం, ఆరోగ్యకరమైన ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్‌ కూడా అధికంగా ఉంది. ఈ పోషకాలన్నీ ఎముకల సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తాయి.

ఆకు కూరలు..

ఆకు కూరలు..

శీతాకాలంలో ఆకుకూరలు ఎక్కుగా దొరుకుతాయి. కాల్షియం లోపాన్ని భర్తీ చేయడానికి పాలకూర, ఆవకూర మీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

రాగులు..

రాగులు..

రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను ధృడంగా చేయడానికి సహాయపడుతుంది. రాగులు పిల్లలకు, వృద్ధులకు మంచి ఆహారం. రాగులు మీ ఆహారంలో తీసుకుంటే.. ఎముకుల గల్లబారడం, ఎముకలు పగుళ్లు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. డైలీ రాగి జావను తాగవచ్చు. ఉదయం టిఫెన్‌గా.. మొలకెత్తిన రాగులను తినవచ్చు. దీంతోపాటు రాగి పిండితో ఇడ్లీలు, దోశలను తయారు చేసుకొని తినవచ్చు.

ఇవీ తీసుకోండి..

ఇవీ తీసుకోండి..

సార్డిన్ ఫిష్, బ్రకోలీ, సోయాబీన్, అంజీర్‌ పండ్లు, తృణధాన్యాలలో కూడా కాల్షియం పుష్కలంగా లభిస్తుందని పోషకాహార నిపుణురాలు అంజలి అన్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news