కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. హీరోయిన్స్ వారి చెడు అలవాట్ల విషయంలో ఓపెన్‌గానే ఉన్నారు. ఇక తమ అభిమాన హీరోయిన్‌కు ఓ దురలవాటు ఉందని తెలిస్తే ఫ్యాన్స్ బాధపడతారటనంలో సందేహమేమీ అక్కర్లేదు. తాజాగా అలా ఓ బాలీవుడ్ బ్యూటీకి పబ్లిక్‌గా సిగరెట్ తాగుతున్న ఫొటో బయటకు వచ్చింది. నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్స్ సదరు అమ్మడిని నెట్టిట తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అనన్య పాండే. ఈ బాలీవుడ్ చిన్నది తెలుగులోనూ లైగర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
లైగర్ సినిమాపై అనన్య పాండే భారీ ఆశలనే పెట్టుకుంది. కానీ డిజాస్టర్ కావటంతో సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. తాజాగా ఈమె తన కజిన్ అలనా పాండే మెహందీ ఫంక్షన్‌కు హాజరైంది. ఆ సమయంలో సిగరెట్ తాగుతుండగా అదే ఈవెంట్‌కు వచ్చిన ఓ యువకుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొంత సేపటికి ఫొటోలను డిలీట్ చేసినప్పటికీ నష్టం జరిగిపోయింది. అప్పటికే ఆ ఫొటోను చాలా మంది స్క్రీన్ సేవ్ చేసేసుకున్నారు. ఇప్పుడదే ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అనన్య పాండే సిగరెల్ తాగటంపై నెటిజన్స్ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కొందరు నెగెటివ్‌గా కామెంట్ చేస్తే. కొందరేమో పాజిటివ్‌గా స్పందించారు. బాలీవుడ్‌లో ఇలాంటివన్నీ కామన్ అని అంటున్నారు.
ALSO READ:
- Read latest Tollywood updates and Telugu News