కూతురు ఇష్టాన్ని కాదనలేదు..
Woman Marries Lord Krishna idol: రక్ష సొలాంకి తండ్రి రంజిత్ సింగ్.. కాలేజీ పిన్సిపాల్‍గా రిటైర్ అయ్యారు. శ్రీకృష్ణుడు తన మెడలో పూలమాల వేస్తున్నట్టు రక్షకు ఎప్పటి నుంచో కల వస్తోందని, అప్పటి నుంచే ఆమెకు కృష్ణుడు అంటే ఇష్టం పెరిగిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుందని రంజిత్ తెలిపారు. అందుకే కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలన్న తన కూతురి ఇష్టాన్ని కాదనలేదని చెప్పారు. ఈనెల 11వ తేదీన కృష్ణుడి విగ్రహాన్ని రక్ష సొలాంకి వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు బంధువులతో కలిసి వచ్చి పెళ్లిని ఘనంగా జరిపారు రంజిత్ సింగ్.