Friday, March 31, 2023

Weight loss: అన్నం తింటే.. బరువు తగ్గడం కష్టమా..? – does eating rice makes you fat what experts saying

Weight loss: బరువు తగ్గాలని ప్రయత్నించే వ్యక్తులకు ఎదురయ్యే.. మొదటి ప్రశ్న అన్నం తినాలా? వద్దా? బరువు తగ్గే విషయానికి వస్తే, దాదాపు అందరూ చెప్పేది ఒకటే.. అన్నం తినకూడదని. ప్రపంచంలోని సగం మందికి అన్నం ప్రధాన ఆహారం. అయినప్పటికీ.. బరువు పెరగడానికి, అన్నం ప్రధాన కారణంగా చెప్పుకుంటారు. అయితే, అన్నం తింటే నిజంగా బరువు పెరుగుతారా..? వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునేవారు అన్నం తినకూడదా..?
బరువు పెరగడానికి బియ్యంతో సంబంధం లేదని ప్రముఖ ఫిట్‌నెస్‌ కోచ్‌ మిటెన్‌ కాకాయియా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షేర్‌ చేశారు. అన్నం మనల్ని లావుగా చేయదని మిటెన్‌ కాకాయియా అన్నారు. బరువు తగ్గడానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని మిటెన్‌ చెప్పారు. మీ ఫిట్‌నెస్‌ టార్గెట్‌ను రిచ్‌ అవ్వడానికి.. రైస్‌ మానేయడం మంచిది కాదని అన్నారు. బరువు పెరగడానికి రోటీ, బియ్యం కారణం కాదని చెప్పారు.

అతిగా తినడమే ప్రధాన కారణం..

అతిగా తినడమే ప్రధాన కారణం..

అతిగా తినడమే.. బరువు పెరగడానికి ప్రధాన కారణమని ఫిట్‌నెస్‌ కోచ్‌ మిటెన్‌ అన్నారు. అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయన్నారు. బరువు పెరగడానికి.. ఇది ఏకైక కారణం కానప్పటికీ, ఇదే ప్రధాన పాత్ర పోషిస్తుంది.

అన్నల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కేలరీల తక్కువగా తీసుకుంటే.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు.. రోజూ అవసరమైన దానికంటే.. తక్కువగా కేలరీలు తీసుకోవాలని సూచించారు. ఇలా క్యాలరీలు తగ్గిస్తే.. బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఫిట్‌నెస్‌ కోచ్‌ మిటెన్‌ అన్నారు.

మీరు హెల్తీగా బరువు తగ్గడానికి.. లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలని ఫిట్‌నెస్‌ కోచ్‌ మిటెన్‌ అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ ప్రకారం, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి, ఈ క్రింది వాటిని ట్రై చేయవచ్చు.

వ్యాయామం చేయండి..

వ్యాయామం చేయండి..

బరువు తగ్గాలనుకునేవారు.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, శరీరాన్ని చురుకుగా ఉంచాలి. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా.. అనేక వ్యాధులు దూరం అవుతాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, హెల్తీ వెయిట్‌ మెయింటేన్‌ చేయాలనుకుంటే… ప్రతివారం కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

తాజా పండ్లు, కూరగాయలు తీసుకోండి..

తాజా పండ్లు, కూరగాయలు తీసుకోండి..

బరువు తగ్గాలనుకునే వారు.. వారి డైట్‌లో ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. వీటితో పాటు.. పండ్లు, కూరగాయలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది, ఫైబర్‌ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలోని చెడు టాక్సిన్స్‌ను కూడా తొలగిస్తుంది. ఫైబర్‌ కేలరీలను తీసుకోవడం నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా మీరు త్వరగా బరువు తగ్గుతారు.

Also Read: ఈజీగా బరువు తగ్గించే.. 5 బెస్ట్‌ డైట్స్‌‌‌‌‌‌ ఇవే..!

ఈ ఆహారానికి దూరంగా ఉండండి..

ఈ ఆహారానికి దూరంగా ఉండండి..

అధిక క్యాలరీలు, కొవ్వులతో నిండి ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల అధిక బరువుతో పాటు డయాబెటిస్‌, రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. బరువు తగ్గాలనుకునే వారు శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్‌, క్యాండీస్‌, బ్రెడ్‌, ఫాస్ట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పేస్ట్రీలు, కేక్స్‌, కుకీస్‌.. వంటి బేకరీ పదార్థాల్లో చక్కెరలు, ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ (చెడు కొవ్వులు) అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను అమాంతం పెంచుతాయి. అలాగే వీటిని అమితంగా తీసుకోవడం వల్ల బరువూ పెరుగుతాం. పిజ్జా, బర్గర్‌ వంటి జంక్‌ ఫుడ్స్‌కు కూడా దూరంగా ఉండాలి. మీ డైట్‌లో చక్కెర, సంతృప్త కొవ్వులు, సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తినకూడదు.

Also Read: ఇవి హ్యాపీగా తింటూ.. ఈజీగా బరువు తగ్గండి..!

నీరు ఎక్కువగా తాగండి..

నీరు ఎక్కువగా తాగండి..

మీరు బరువు తగ్గాలనుకుంటే, నీరు ఎక్కువగా తీసుకోండి. నీరు ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరం నుంచి టాక్సిన్స్‌ తొలగుతాయి. నీరు ఎక్కువగా తాగితే మీ ఆకలి కూడా తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news