Thursday, March 30, 2023

union cabinet meeting, DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపుపై ఇవాళే కీలక ప్రకటన! – union cabinet meeting on da hike for govt employees likely today


DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగులకు 2023, జనవరికి సంబంధించి డియర్నెస్ అలవెన్స్ – డీఏ పెంపుపై ఇవాళ నిర్ణయం తీసుకోనుంది కేంద్ర సర్కార్. ఈ ఏడాది డీఏ (dearness allowance) పెంపు ఎంత ఉంటుందనేది అధికారికంగా వెల్లడి కానుంది. దీంతో జీతభత్యాలు పెరగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ కేంద్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది. ఈ సమావేశంలోనే డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ్టి సమావేశంలో ఇదే ప్రధాన అంశంగా ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

42 శాతానికి పెంపు!
సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవాళ తీపికబురు అందించనుంది కేంద్ర సర్కార్. నాలుగు శాతం డీఏ పెంపు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి డియర్నెస్ అలవెన్స్ పెంచే సూచనలు ఉన్నాయని గత ఫిబ్రవరి నెలలో పేర్కొంది పీటీఐ. అయితే, ఇది తాజా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రీయల్ వర్కర్స్ పై డీఏ పెంపు (DA Hike) ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సీబీఐ-డబ్ల్యూను ప్రతి నెల కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది.

తాజా డేటా ప్రకారం రిటైల్ ద్రవ్వోల్బణం గత నెల ఫిబ్రవరిలో 6.44 శాతానికి దిగివచ్చింది. ఆహార పదార్థాలు, ఇంధనం వంటి వాటి ధరలు దిగివస్తున్న క్రమంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతోంది. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యం 6 శాతానికిపైనే కొనసాగుతుండడం గమనార్హం. వరుసగా రెండో నెలలోనూ లక్ష్యానికిపైనే కొనసాగుతోంది. మార్చి 13న విడుదల చేసిన డేటా ప్రకారం సీబీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 6.52 శాతం, 6.07 శాతంగా ఉంది. డీఏ పెంపులో ఏవైనా మార్పులు చేసినట్లయితే అది జనవరి, 2023 నుంచే అమలులోకి వస్తుంది.

ప్రస్తుతం కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం డీఏ పొందుతున్నారు. చివరిసారిగా డీఏ పెంపు సెప్టెంబర్ 28, 2022లో చేసింది కేంద్ర ప్రభుత్వం. అది జులై 1, 2022 నుంచి అమలులోకి తీసుకొచ్చింది. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంతో 12 నెలల ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా అప్పుడు డీఏను నాలుగు శాతం పాయింట్లు పెంచి 38 శాతానికి చేర్చింది.



Source link

Latest news
Related news