Facebook Job Cuts: ఫేస్‌బుక్ పేరెంట్ మెటా మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. ఈసారి కూడా పెద్ద ఎత్తున 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ మేరకు మంగళవారం ప్రకటించింది ఈ దిగ్గజ కంపెనీ. ఇక రెండో దశ మాస్ లేఆఫ్స్ ప్రకటించిన తొలి పెద్ద టెక్ కంపెనీ మెటానే కావడం గమనార్హం. దీంతో మరోసారి ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు భయపెడుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం ఉద్యోగాల కోతకు కారణమవుతోంది. ఇప్పుడు మెటా ఉద్యోగాల లేఆఫ్స్ ప్రకటించిన వేళ.. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగుల తొలగింపు ప్రకటన తర్వాత మెటా షేరు 6 శాతం మేర పెరిగింది.
సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా మెటా లేఆఫ్స్ చేస్తోంది. గతంలోనే ఈ ప్రణాళికల గురించి వివరించారు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్. ఇందులో భాగంగానే 5000 ఓపెనింగ్స్‌కు సంబంధించి కొత్తవారితో ఇప్పట్లో భర్తీ చేయకూడదని నిర్ణయించింది మెటా. భారీగా ఉద్యోగులను మెటా తొలగించడం ఇది 4 నెలల్లోనే రెండోసారి కావడం గమనార్హం. గతేడాది నవంబర్‌లో కూడా ఏకంగా 11 వేల మందిని ఒకేసారి పీకేసింది.
Pre Installed Apps: కేంద్రం కొత్త రూల్స్.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చుక్కలే.. పక్కా ప్రణాళికతో మోదీ సర్కార్ ముందుకు?
HP Laptop Price: అదిరిపోయే ఫీచర్లతో హెచ్‌పీ సరికొత్త ల్యాప్‌టాప్.. రూ.29 వేలకే.. ఆఫర్ అదిరింది కదా!
ఇక వ్యాపారం నెమ్మదించిందని, ఆదాయం పడిపోతోందని, సంస్థ ఆర్థిక స్థితి కాపాడుకునేందుకు ఖర్చులు తగ్గించుకుంటున్నామని అప్పట్లో వెల్లడించింది. రానున్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని, దాని కోసం ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని చెప్పారు మార్క్ జుకర్‌బర్గ్. ఈ మేరకు మెటా సిబ్బందికి ఒక సందేశం పంపించారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అన్ని రంగాల ఉద్యోగులపై ఎఫెక్ట్ చూపిస్తోంది. వాల్‌స్ట్రీట్ బ్యాంకులు గోల్డ్‌మన్ సాక్స్ నుంచి మోర్గాన్ స్టాన్లీ వరకు, పెద్ద పెద్ద టెక్ కంపెనీలు అమెజాన్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు ఎవరికీ ఈ కష్టాలు తప్పట్లేవు. లేఆఫ్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఇక మొత్తం టెక్ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. 2022 ప్రారంభం నుంచి మొత్తం 2,90,000 మంది ఉద్యోగులు లేఆఫ్‌కు గురయ్యారు. ఇందులో 40 శాతం వరకు ఈ సంవత్సరమే జరగడం గమనార్హం.
Adani Group కు LIC ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చిందో తెలుసా? కేంద్ర మంత్రి Nirmala Sitaraman చెప్పేశారుగా..
Lending Rates: SBI బాదుడే బాదుడు.. కీలక ప్రకటనతో కస్టమర్లపై ఎఫెక్ట్.. రేపటి నుంచే నిర్ణయం అమల్లోకి..