Tuesday, March 21, 2023

jeff bezos, Amazon: జెఫ్ బెజోస్ రెండే ప్రశ్నలు.. ఆన్ ది స్పాట్ ఆమెకు జాబ్.. పక్క డెస్క్ కేటాయింపు – jeff bezos hired amazon candidate on the spot after asking two questions


Amazon: ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం పొందాలంటే అంత సులభమైన విషయమేమీ కాదు. చాలా రకాల ఇంటర్వ్యూ ప్రక్రియలను దాటుకుని, అందరికన్నా మెరుగైన ప్రదర్శన చేసినప్పుడే ఆ ఉద్యోగం దక్కుతుంది. అయితే, ఉద్యోగానికి అవసరమైన చదువు, అనుభవం లేకున్నా ఉద్యోగం పొందడం దాదాపుగా అసాధ్యం. కానీ ఓ మహిళ తనకు ఎలాంటి అనుభవం లేకున్నా అమెజాన్‌లో ఉద్యోగం సంపాదించారు. అంతే కాదు.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను మెప్పించారు. ఆమెనే ఆన్ హియాట్. అమెజాన్‌లో జూనియర్ అసిస్టెంట్ (junior assistant at Amazon) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆమెకు కంపెనీతో గతంలో ఎలాంటి సంబంధాలు లేవు. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లేదు. ఎలాంటి అనుభవమూ లేదు. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా ఆమెకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది.

సీనియర్ అసిస్టెంట్ స్థాయిల్లో పలు రౌండ్ల ఇంటర్వ్యూకు హాజరయ్యారు ఆన్ హియాట్. ఆ తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో (Jeff Bezos) ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ముఖాముఖి కోసం జెఫ్ బెజోస్ ఉన్న గదిలోకి వెళ్లిన క్రమంలో ఆయన రెండే రెండు ప్రశ్నలు అడుగుతానని, సరైన సమధానం ఇస్తే ఉద్యోగం నీదేనని చెప్పినట్లు ఓ ఛానల్‌తో చెప్పారు ఆన్ హియాట్. అందులో మొదటి ప్రశ్న మెదడుకు పని చెప్పేదిగా పేర్కొన్నట్లు తెలిపారు.

‘బలంగా శ్వాస తీనికున్నా. అప్పుడు ఆయన లేచి నిలుచుున్నారు. పెన్ క్యాప్ తీసి వైట్ బోర్డు వద్దకు వెళ్లారు. నేను ఒక గణిత ప్రక్రియను చేస్తాను మీరు సీటెల్ నగరంలో గాజు పలకల సంఖ్య ఎంత ఉంటుందనేది అంచనా వేయాలని అడిగారు. అప్పుడు కొంచ భయం వేసింది. ఎంత మంది ప్రజలు ఉంటారని ఊహించడం కష్టంగా మారింది. అయితే, అదృష్టవశాత్తు 1 మిలియన్ అని చెప్పాను. అది ఆయన చేస్తున్న మ్యాథ్ ప్రక్రియకు సులభతరంగా మారింది. వారిలో అందిరికి ఒక ఇల్లు, రవాణా సౌకర్యం, ఆఫీసు, స్కూల్ వంటి సదుపాయాలు ఉన్నట్లు చెప్పాను. వాటన్నింటికీ కిటికీలు ఉంటాయని చెప్పాను. దీని ప్రకారంగా మ్యాథ్ ప్రక్రియను పూర్తి చేశాం.’ అని పేర్కొన్నారు ఆన్ హియాట్. అయితే, ఈ ప్రక్రియ కేవలం 10 నిమిషాలు మాత్రమే పడుతుందని భావించానని, అయితే, గంటకుపైగా పట్టిందని గుర్తు చేసుకున్నారు. జెఫ్ బెజోస్ వైట్ బోర్డు మొత్తం నంబర్లతో నింపారని గుర్తు చేసుకున్నారు. ఫైనల్‌గా తాను అంచనా వేసిన సంఖ్యనే ఆయన రాయడం సంతోషంగా అనిపించిందన్నారు.

జెఫ్ బెజోస్ అడిగిన రెండో ప్రశ్న మీ కెరీర్ గోల్స్ ఏమిటి? అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు ఆన్ హియాట్. దానికి తనకు అసిస్టెంట్‌గా ఉండడం ఎలాగో తెలియదని, కానీ, తన కంఫర్ట్‌జోన్ నుంచి బయటకు వచ్చి పని చేసేందుకు ఇష్టపడతానని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. అమెజాన్ ప్రతిష్ఠాత్మకమైన, ఉద్వోగభరితమైన వ్యక్తులతో నిండిన సంస్థగా నిరూపించబడిందని చెప్పాని, తాను కూడా వారిలో ఉండాలని, వారికి తెలిసిన వాటిని నేర్చుకోవాలని కోరుకంటున్నట్లు సమాధానం ఇచ్చినట్లు చెప్పానన్నారు.

ఇంటర్వ్యూ ముగింపునకు వచ్చే సరికి జెఫ్ బెజోస్ సహా తనకు కూడా ఓ నమ్మకం వచ్చినట్లు చెప్పారు ఆన్ హియాట్. జూనియర్ క్యాండిడేట్ అయినప్పటికీ వృత్తిలో విజయవంతం అయ్యేందుకు ఏదైనా చేసే సత్తా ఉందని ఆయన భవించినట్లు గుర్తించానన్నారు. ఈ క్రమంలోనే ఆన్ ది స్పాట్‌లోనే జాబ్ ఇస్తున్నట్లు జెఫ్ బెజోస్ తెలిపారని గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగంలో చేరేందుకు ఓపెన్ డెస్కును కేటాయించారని, అది కంపెనీలోనే జెఫ్ బెజోస్‌కు అత్యంత దగ్గరగా కేవలం మూడు అడుగుల దూరంలోనే ఉందని తెలిపారు.

Sudha Murthy: రూ.35వేల కోట్లకు అధిపతి.. అయినా కట్టెల పొయ్యిపై వండుతూ..!Elon Musk: ఆ ఉద్యోగికి క్షమాపణ చెప్పిన ఎలాన్ మస్క్.. ఆయన చేసిన తప్పేంటి?KCR తర్వాత నేనే సీనియర్.. టీడీపీలో చేరటానికి కారణమదే: మంత్రి ఎర్రబెల్లి



Source link

Latest news
Related news