Monday, March 20, 2023

Husband Problems : రూమ్ నుంచి బయటికి రాకుండా నా భర్త ఇబ్బంది పెడుతున్నాడు.. – ways a wife makes her husband feel like a failure

ప్రశ్న: హాయ్.. నా భర్త ఈ మధ్య ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. జాబ్ విషయంలో ఈ టూర్ జరిగింది. ఇక్కడ తను ఓ జాబ్ చేస్తున్నాడు. తను అక్కడికి వెళ్ళి మరికాస్తా తన పొజిషన్‌ని మెరుగుపరుచుకోవాలనుకున్నాడు. అంతా బానే ఉంది. ఎన్నో రోజులు వేచిన సమయం దగ్గరికొచ్చి ఆయన ఆస్ట్రేలియా వెళ్ళాడు. అంతా బానే ఉందనుకునే టైమ్‌కి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

ఆస్ట్రేలియాకి జాబ్ విషయంలో వెళ్ళిన మా వారి ప్లాన్స్ అన్నీ బెడిసి కొట్టాయి. పని కాలేదు. దాంతో అతను బాగా అప్సెట్ అయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పట్నుంచి తాను ఓ పంజరంలోనే ఉన్నట్లుగా ఫీల్ అయిపోతున్నాడు. రూమ్‌లో నుంచి బయటికి రావట్లేదు. ఎవరితో మాట్లాడట్లేదు. మందు తాగుతున్నాడు. సిగరెట్స్ కూడా గుప్పుగుప్పుమంటూ తాగుతున్నాడు. ఏం చేయాలి. తనని ఎలా బయటికి తీసుకురావాలి. నాకు సలహా ఇవ్వండి.

Selfish persons : సెల్ఫిష్ వ్యక్తుల్ని ఇలా గుర్తుపట్టండి..
నిపుణుల సలహా..

హాయ్.. ఈ లెటర్ రాసినందుకు ధన్యవాదాలు. ఎవరికైనా సరే కూడా ఓ పని జరుగుతుందని అనుకున్నప్పుడు దానిపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవి జరగనప్పుడు చాలా ఫీల్ అవుతారు. ఇది ఎవరికైనా కామన్. మీ హజ్బెండ్ విషయంలోనూ ఇదే జరిగింది. తను చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న పని జరగకపోయే సరికి అది చాలా ఇబ్బందిగా అనిపించొచ్చు. ఫెయిల్యూర్స్ వచ్చేసరికి కొంతమంది దానిని తీసుకోలేరు. లైఫ్ మొత్తం అయిపోయిందనుకుంటారు.

couple fight

కొంతమంది తమ ఫెయిల్యూర్స్‌నే తీసుకోలేరు. దీనికి తోడు తమ గురించి చుట్టుపక్కల వారు ఏమనుకుంటారని, పని గురించి అడిగే వారికి ఏ ఆన్సర్ చెప్పాలో తెలియక త్వరగా బయటికి రాలేరు. ఇలాంటి ఒత్తిడి కారణంగానే చాలా మంది ఎక్కువగా ఫీల్ అవుతుంటారు.

ఇలా ఎదుటివారిని ఫేస్ చేయలేనప్పుడు తమని తామే ఓ రూమ్‌లో లాక్ అయిపోవడం చెడు అలవాట్లకి అలవాటు పడిపోవడం. ఆ మత్తులో బాధని మరిచిపోదామనుకుంటారు. కానీ, జరిగే నష్టం గురించి తెలియదు.

Also Read : Couple in Bedroom : బెడ్‌పై ఇలా చేస్తే రొమాన్స్‌‌ బాగా ఎంజాయ్ చేస్తారు

మీరు ఈ విషయంలో తనకి హెల్ప్ చేసేలా చూడండి. తన పక్కన కూర్చుని బాధను పోగొట్టేలా మాట్లాడండి. లైఫ్‌లో ఫెయిల్యూర్స్ కామన్ అని తనకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ విషయంలో మీరు హ్యాండిల్ చేయలేకపోతే తనని బాగు చేసేందుకు ఎక్స్‌పర్ట్స్ సాయం తీసుకోవచ్చు.

ఎందుకంటే, పరిస్థితి ఇలానే ఉంటే తనకి ఇది ఓ మానసిక సమస్యలా మారొచ్చు. అందుకే దీనిని సీరియస్‌గా తీసుకోండి. భార్యాభర్తలు అన్నప్పుడు ఒకరు బాధలో ఉన్నప్పుడు ఒకరు తోడుగా ఉండి ఆ సమస్యని కచ్చితంగా సాల్వ్ చేయాలి. ఆల్ ది బెస్ట్.

Latest news
Related news