అయితే ఈ విషయంపై ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ… గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేయటాన్ని ఖండించారు. పయ్యావుల కేశవ్ ఆరోపణలపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. గవర్నర్ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత సభలో తీర్మానాన్ని మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని చదివి వినిపించారు. వాయిస్ ఓటుతో తీర్మానాన్ని ఆమోదించారు. వారిద్దరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ నిర్ణయంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మరోసారి మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టగా అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాలు ముగిసే వరకు నిమ్మల, పయ్యావులపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
BREAKING NEWS