ITBP Recruitment: చైనా సరిహద్దు(China Border)లో అదనంగా 9,400 మంది సిబ్బందిని బందోబస్తుకు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గత వారం అనుమతించింది. ఈ 9,400 మందికి అరుణాచల్ ప్రదేశ్‍లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడే ఐటీబీపీ కొత్త సెక్టార్ హెడ్‍కార్వర్ట్స్ ఏర్పాటవుతోంది. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించాలని కేంద్రం ఆలోచిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, లద్ధాఖ్, కశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కింగ్, అరుణాచల్ ప్రదేశ్‍లోని ఇండో-చైనా సరిహద్దు వద్ద 3,488 కిలోమీటర్ల మేర ఐటీబీపీ గార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారు.