Biryani ATM: ఏటీఎం ఎలా పని చేస్తుంది?
ఇది కూడా సాధారణ ఏటీఎం మెషిన్ మాదిరిగానే ఉంటుంది. కానీ స్క్రీన్ సైజ్ పెద్దదిగా ఉంటుంది. 32 అంగుళాల స్క్రీన్ ను ఈ సర్వీస్ కోసం ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ పై ఆ హోటల్ లో లభించే బిర్యానీల మెన్యూ డిస్ ప్లే అయి ఉంటుంది. మీరు అందులో మీకు కావాల్సినవి సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత డెబిట్, క్రెడిట్, యూపీఐ, లేదా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా బిల్ పే చేయాలి. కొన్ని నిమిషాల్లోనే మీరు కోరుకున్న బిర్యానీ నీట్ గా ప్యాక్ అయి మీ ముందుకు వస్తుంది. బిర్యానీ రెడీ కాగానే మీకు స్క్రీన్ పై ప్రాంప్టింగ్ వస్తుంది. అక్కడ ఓపెన్ డోర్ ఆప్షన్ ను క్లిక్ చేయగానే, డోర్ ఓపెన్ అవుతుంది. బిర్యానీ ప్యాకెట్ మీ ముందు ఉంటుంది.త్వరలో మరిన్ని బ్రాంచ్ ల్లోనూ ఈ సర్వీసును ప్రారంభించాలని ‘బీవీకే బిర్యానీ’ ఆలోచిస్తోంది. అంతేకాదు, ఇతర నగరాల్లోనూ తమ బిర్యానీ సెంటర్ లను ప్రారంభించే యోచనలో ఉంది.