UPSC EPFO Recruitment 2023: మొత్తం 577 పోస్ట్ లు..
ఈ Asstt. Provident Fund Commissioner and Enforcement Officer-Accounts Officer పోస్ట్ లకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. అందుకు గానూ అభ్యర్థులు upsc.gov.in. వెబ్ సైట్ ను సందర్శించాలి. ముందుగా డిటైల్ నోటిఫికేషన్ ను క్షుణ్నంగా చదువుకోవాలి. మొత్తం 577 పోస్ట్ ల్లో 418 ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ (Enforcement Officer/Accounts Officer) పోస్ట్ లు, 159 అసిస్టెంట్ ప్రావిడెండ్ ఫండ్ కమిషనర్ (Assistant Provident Fund Commissioner) పోస్ట్ లు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ముందుగా రాత పరీక్ష, ఆ తరువాత ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ రెండు పోస్ట్ లకు రాత పరీక్ష వేరువేరుగా ఉంటుంది. వయో పరిమితి, విద్యార్హతలు, పరీక్ష విధానం, సిలబస్ మొదలైన వివరాలు నోటిఫికేషన్ లో వివరంగా ఉన్నాయి.