Luggage: రైల్వే ప్రయాణమంటేనే ఎంతో ప్రయాసతో కూడుకున్న పని. ఎన్ని రైళ్లు నడిచినా నిత్యం రద్దీగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది భారతీయ రైల్వే. ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు నిబంధనలను అమలులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులు ఇష్టం వచ్చినట్లు లగేజీ తీసుకొచ్చి కంపార్ట్‌మెంట్లలో తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించకుండా వాటిపై పరిమితిని విధించింది. విమానాల్లో మాదిరిగా రైళ్లలోనూ నిర్దిష్ఠ పరిమితి వరకు మాత్రమే లగేజీని తీసుకెళ్లవచ్చు. ఈ క్రమంలో రైలు ఎక్కే ముందే ప్రయాణికులు ఎంత వరకు లగేజీ తీసుకెళ్లవచ్చే తెలుసుకోవడం మంచింది. లేదంటే భారీ జరిమానా కట్టాల్సి రావచ్చు.
దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువ మొత్తంలో వస్తువులు, బ్యాగులు వంటివి తీసుకెళ్తుంటారు. అలాంటి సందర్భంలో వారు ఇబ్బందులు పడడమే కాకుండా తోటి ప్రయాణికులను ఇబ్బందుల్లో పడేస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకునే లగేజీ పరిమితులు విధించింది భారతీయ రైల్వే శాఖ. ఒక్కో కోచ్‌కు ఒక్కో లగేజీ పరిమితిని నిర్ణయించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- రైల్వే శాఖ వెబ్‌సైట్ ప్రకారం రైలు ప్రయాణికులు 40 కిలోల నుంచి 70 కిలోల వరకు బరువున్న లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. అది కోచ్‌లను బట్టి మారుతుంటుంది.
- ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా స్లీపర్ క్లాస్‌లో 40 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.
- సెకండ్ ఏసీలో 50 కిలోల వరకు అనుమతిస్తున్నారు.
- ఫస్ట్ క్లాస్ ఏసీ రైలు కోచ్‌లలో ప్రయాణించే వారు 70 కిలోల వరకు బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చు. వీరు అదనపు రుసుములు చెల్లిస్తే 80 కేజీల వరకు తీసుకెళ్లే వీలు కల్పిస్తున్నారు.
- ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారికి జరిమానా విధిస్తారు అంధికారులు. అది లగేజీ, కోచ్‌ను బట్టి మారుతుంటుంది.
అదనపు ఛార్జీలు..
రైలు ప్రయాణంలో ఏ ప్రయాణికుడైనా పరిమితికి మించి లగేజీని తీసుకెళ్తున్నట్లు తెలిసిన క్రమంలో వారిపై అదనపు ఛార్జీలు విధిస్తారు. ఆ తర్వాత ఆ ప్రయాణికుడు లగేజీ వ్యాన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం రూ.109 చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు.. నిషేధం విధించిన వస్తువులు తీసుకెళ్తే కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. నిషేధిత జాబితాలో మంటలు చెలరేగే రసాయనాలు, యాసిడ్, క్రాకర్స్, ఘీ, తోలు, ఆయిల్, గ్రీస్ వంటివి ఉన్నాయి. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
Gold Bonds: బంగారంపై భారీ తగ్గింపు.. ఆఫర్ 4 రోజులే.. ఎలా కొనుగోలు చేయాలి?
Gold: రూ.37 వేలకే తులం బంగారం.. ఎలాంటి ట్యాక్స్ లేదు.. ఈ ఆఫర్ ఎక్కడంటే?
పింఛనుదారులకు EPFO ఝలక్.. అధిక పెన్షన్‌కు మెలిక.. వారమే గడువు.. వారిలో ఆందోళన!