SBI Sarvottam FD: బ్యాంకులు కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేయాలని చూస్తుంటాయి. అందుకే వారిని ఆకర్షించేందుకు కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) కూడా కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం తీసుకొచ్చింది. దీనినే ఎస్‌బీఐ సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్లుగా (SBI Sarvottam term deposits) పిలుస్తోంది. ఇతర సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల కంటే ఎస్‌బీఐ ఈ టర్మ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ FD కింద ఎంత వడ్డీ వస్తుంది? దీనికి ఎవరు అర్హులు? సహా ఇతర వివరాలు అన్నీ మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎస్‌బీఐ సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్లు.. రెసిడెంట్ ఇండివిడ్యూవల్స్, నాన్ ఇండివిడ్యువల్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. వీరంతా ఈ FD తెరిచేందుకు అవకాశం ఉంటుంది. మైనర్లు, NRI లకు ఈ అకౌంట్ తెరిచేందుకు అవకాశం ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. SBI సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్ల కింద.. రెండేళ్ల కాలవ్యవధితో కూడిన ఎఫ్‌డీలపై బ్యాంక్ గరిష్టంగా 7.4 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక ఏడాది టెన్యూర్ ఉంటే ఈ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ఇక సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు మరో 50 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ అందనుంది. వీరు రెండేళ్ల టెన్యూర్ ఉన్న FDపై 7.90 శాతం, అదే ఏడాదికి అయితే 7.60 శాతం వడ్డీ అందుకుంటారు.
Adani Group కు ఎల్‌ఐసీ ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చిందో తెలుసా? Nirmala Sitaraman కీలక ప్రకటన..
ఇక డిపాజిట్ మొత్తం విషయానికి వస్తే.. రిటైల్ కస్టమర్లు కనీసం రూ.15.01 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది గరిష్టంగా రూ.2 కోట్ల వరకు ఉండొచ్చు. SBI సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్ల కింద బల్క్ డిపాజిట్లను అనుమతిస్తుంది SBI. ఇది రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేత ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలకు కాలపరిమితి సంవత్సరం, రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది. అంతకంటే ఎక్కువా, తక్కువా అంటే ఇందులో కుదరదు. నిర్ణీత కాలవ్యవధికి మాత్రమే డిపాజిట్ చేయాలి.
ఇదే సమయంలో ఈ డిపాజిట్ల కింద ప్రీ మెచ్యూర్ విత్‌డ్రా కూడా కుదరదు. అంటే కాలవ్యవధి ముగియకముందే నగదు తీసుకోవడానికి అవకాశం లేదన్నమాట. దీనిని రెనివల్ చేసుకునే సదుపాయం కూడా లేదు. ఒక్కసారి మీ ఎఫ్‌డీ మెచ్యూర్ అయిపోతే.. ఆటోమేటిక్‌గా మీ నగదు వడ్డీతో కలిపి సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ లేదా క్యాష్ క్రెడిట్/ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్‌లోకి పడిపోతుంది.
Microsoft Employee: ‘చాలా కష్టంగా ఉంది.. మా టీం మొత్తాన్ని ఒకేసారి పీకేసింది’.. పాపం 8 ఏళ్లు చేసినా ఇలా ఘోరంగా!
Gold Loans: గోల్డ్ లోన్ కావాలా? ఏ బ్యాంకులో వడ్డీ రేటు ఎంతో తెలుసా.. టాప్ 10 ఇక్కడ చూడండి..