Sunday, April 2, 2023

Oscars 2023: RRR ఆస్కార్ విజయం వెనకున్న మాస్టర్ మైండ్.. కార్తికేయ!

ఆస్కార్స్ అవార్డ్ (Oscars Award).. ఫిలిం మేకర్స్‌తో పాటు ప్రతీ ఆర్టిస్ట్‌కు ఒక డ్రీమ్‌గా చెప్పొచ్చు. సినీ రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారాన్ని గెలుచుకోవాలంటే మంచి సినిమా తీస్తేనో లేదా అలాంటి సినిమాలో అద్భుతమైన నటన కనబరిస్తేనో సరిపోదు. పై విషయాలతో పాటు అకాడమీ ఓటర్ల దృష్టిని ఆకర్షించగల ఎక్సలెంట్ మార్కెటింగ్ క్యాంపెయిన్ (Marketing Campaign) కూడా అవసరం. ఈ రెండు అంశాల్లోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్లింది కాబట్టే 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఇండియన్ ఫిల్మ్ RRR ఆస్కార్‌ను సొంతం చేసుకోగలిగింది. కాగా.. RRR తరఫున ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఆస్కార్ గెలుపును సుసాధ్యం చేసిన మాస్టర్ మైండ్ ఎవరో కాదు.. రాజమౌళి (Rajamouli) కుమారుడు కార్తికేయ (Karthikeya).

RRR మూవీ ఆస్కార్స్‌ అవార్డ్స్‌ జర్నీకి సంబంధించి మార్కెటింగ్ క్యాంపెయిన్‌లో కార్తికేయదే కీ రోల్. తన కృషే ఆస్కార్ విజయాన్ని సాధ్యం చేసింది. అకాడమీ ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు ప్రీమియర్ షోస్, ప్రముఖులతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తూ తెర వెనక కష్టపడింది కార్తికేయ. నిజానికి RRR చిత్రానికి భారతదేశం నుంచి ఆస్కార్‌ ఎంట్రీకి అధికారికంగా చాన్స్ దక్కలేదు. అయినప్పటికీ సెపరేట్‌గా ఆస్కార్‌కు ఎంట్రీ ఇచ్చి, తుది నామినేషన్స్‌లో స్థానం దక్కించుకుని చివరకు ట్రోఫీ కైవసం చేసుకోవడం వెనక కార్తికేయ విజన్, ప్లానింగ్ కీలకపాత్ర పోషించాయనేది వాస్తవం.
Oscars 2023: ఆస్కార్ విజేతలకు నో ‘క్యాష్’.. నామినీస్‌కి మాత్రం రూ.కోటి విలువ చేసే గిఫ్ట్ బ్యాగ్
ఆస్కార్ వేదికపై చంద్రబోస్‌తో కలిసి కీరవాణి అవార్డ్ అందుకున్న తర్వాత తన స్పీచ్‌లో ఒక్క కార్తికేయకు మాత్రమే థాంక్స్ చెప్పాడు. ఈ ఒక్క విషయం చాలు.. ఆస్కార్ విజయం దాకా తమను నడిపించింది ఎవరనేది. నిజానికి కార్తికేయ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చాలా యానిక్‌గా ఉంటూనే క్రియేటివ్‌గా ఉంటాయి. బిహైండ్ ది సీన్స్‌కు సంబంధించిన ఫుటేజ్, టీజర్లు, ట్రైలర్స్‌ను విడుదల చేస్తూ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేయడంతో పాటు కంటెంట్‌ను అనేక ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా విస్తృతంగా ప్రేక్షకులకు చేరవేయడంలో తనది మాస్టర్ మైండ్.

RRR మూవీ విడుదలై విజయం సాధించిన తర్వాత రాజమౌళి అండ్ టీమ్.. కొంచెం రిలాక్స్ అయ్యారేమో కానీ కార్తికేయ మాత్రం అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నాడు. ఆస్కార్ గెలుచుకునేంత వరకు తన పని కొనసాగుతూనే ఉంది. మొత్తానికి సినిమా మొదలైనప్పటి నుంచి కార్తికేయ పడ్డ కష్టానికి ఫలితం లభించింది. అందుకే RRR విజయంలో నటీనటులు, సాంకేతిక సిబ్బంది మాత్రమే కాకుండా తన మార్కెటింగ్ క్యాంపెయిన్‌తో అంతర్జాతీయ వేదికపై సినిమాను ప్రమోట్ చేసిన కార్తికేయ కూడా భాగస్వామే.

Latest news
Related news