– అల్లుఅర్జున్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ
ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌ను ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా రీట్వీట్ చేస్తున్నారు. తారక్‌ను అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించడంపై ఆనందపడుతున్నారు. కానీ మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం కాస్త హర్ట్ అవుతున్నారు. ఎన్‌టీఆర్ గురించి అంత గొప్పగా చెప్పి రామ్‌చరణ్ గురించి మాత్రం చివరిలో బ్రదర్ అంటూ సరిపెట్టాడంటూ బన్నీపై ఫైర్ అవుతున్నారు.
ఆస్కార్ వేదికపై
మరోవైపు కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నప్పుడు జరిగిన ఓ ఘటనపై కూడా మెగా ఫ్యాన్స్ అలిగారు. కీరవాణి, చంద్రబోస్.. ఆస్కార్ అవార్డు అందుకోవడానికి స్టేజి మీదకు వెళ్లినప్పుడు కీరవాణి వెనుక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ ఫోటో డిస్‌ప్లే అయింది. కానీ రామ్‌చరణ్ ఫొటో కనిపించలేదు. దీంతో రామ్ చరణ్ ఫోటో ఎందుకు లేదు? అంటూ మెగా ఫ్యాన్స్ ఆ వీడియోను వైరల్ చేశారు.
‘ఆర్ఆర్ఆర్’లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ హీరోలు అయినప్పుడు ఒక్కరి ఫోటో మాత్రమే స్టేజి మీద చూపించడం ఏంటని ఫైర్ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ ఎందకు పట్టించుకోలేదని పోస్టులు పెడుతున్నారు. ఇది సద్దుమణిగిందని అనుకునే లోపు బన్నీ చేసిన ట్వీట్‌తో మళ్లీ వివాదం రాజుకుంది. రామ్ చరణ్‌ను తక్కువ చేసేలా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ వివాదం ఎలా సైలెంట్ అవుతుందో చూడాలి.
- Read latest TV News and Movie Updates