Thursday, March 30, 2023

higher pension, EPFO: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. అధిక పెన్షన్‌ కోసం గడువు పెంపు! – epfo extends deadline for higher pension under eps to may 3 2023


EPFO: అర్హులైన వారు అధిక పెన్షన్ కోసం యాజమాన్యంతో కలిగి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు కొద్ది రోజుల క్రితం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చివరి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కొద్ది రోజులు మాత్రమే గడువు ఇచ్చి వెబ్‌సైట్‌ నుంచి లింకును తొలగించడంతో చాలా మంది పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ ఇప్పుడు శుభవార్త అందించింది ఈపీఎఫ్ఓ. అధిక పెన్షన్ (Higher Pension) కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తూ గడువును పొడిగించింది. ఇప్పటికీ ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు ఉంటే వెంటనే పూర్తి చేసుకుని అధిక పెన్షన్ పొందాలని నిపుణులు చూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 (EPS 95) ప్రకారం అర్హులైన 2014, సెప్టెంబర్‌కు ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం లభించించింది. అధిక పింఛను దరఖాస్తు గడువును ఈపీఎఫ్ఓ మే 3 వరకు పొడిగిస్తూ తాజాగా ప్రకటన చేసింది. గతంలో ఈ గడువు మార్చి 3తోనే ముగిసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది అర్హులైన ఉద్యోగులు దరఖాస్తు చేసేకోలేకపోయినట్లు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరో అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘ఉద్యోగుల, యాజమాన్య యూనియన్ల వినతలు మేరకు అధిక పెన్షన్‌కు సంబంధించిన జాయింట్ ఆప్షన్ దరఖాస్తుల సమర్పణకు గడువు పొడిగించారు. ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు మే 3, 20223 వరకు గడువు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ‘ అని కేంద్ర కార్మిక శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కేవలం 2014, సెప్టెంబర్‌కు ముందు పదవీ విరమణ చేసి ఉండి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశం ఉన్న వారికి ఈ గడువు పెంపు వర్తిస్తుందని పేర్కొంది. మిగిలిన అన్ని రకాల ఈపీఎఫ్ఓ చందాదారులకూ ఈ దరఖాస్తుల గడువు మార్చి 3వ తేదీని తుది గడువుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అధిక పెన్షన్ కోసం అవకాశం కల్పించాలన్న పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు 2022, నవంబర్ 4న కీలక తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడిన నాలుగు నెలల్లోపు అర్హులనై ఉద్యోగులకు అధిక పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పించాలని ఈపీఎఫ్ఓకు సూచించింది. ఈ తీర్పును అనుసరించి ఈపీఎఫ్ఓ చివరి అవకాశంగా మార్చి 3, 2023 వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 20, 2023న నోటిఫికేషన్ విడుదల చేసి మళ్లీ పొడిగింపు అనేది ఉండదని స్పష్టం చేసింది. అయితే, కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఇవ్వడంపై ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో మరోమారు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అయితే, ఉద్యోగుల నుంచి 1.16 శాతం అదనపు కాంట్రిబ్యూషన్ ఏ విధంగా తీసుకుంటారనే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈపీఎఫ్ఓ.

EPF Interest: ఉద్యోగులకు మరోసారి నిరాశేనా? తగ్గనున్న ఈపీఎఫ్ వడ్డీ రేటు!FACT CHECK: రూ.500, రూ.1000 పాత నోట్ల మార్పిడికి మరో అవకాశం.. ఈ వార్తలో నిజమెంత?



Source link

Latest news
Related news