టీ20 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్‌కు బంగ్లాదేశ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. సొంత గడ్డ మీద మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా జరిగిన చివరి టీ20లో ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 57 బంతుల్లో 73 పరుగులు చేయగా.. షంటో 36 బంతుల్లో 47 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. ఓవర్‌కు దాదాపు 8 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 142/6కే పరిమితమైంది.
లక్ష్య చేధనలో ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫిలిప్ సాల్ట్ తొలి ఓవర్ మూడో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత డేవిడ్ మలాన్ (47 బంతుల్లో 53), కెప్టెన్ జోస్ బట్లర్ (31 బంతుల్లో 40) రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. దీంతో 13 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఇంగ్లాండ్ 100/1తో బలంగా ఉంది. కానీ వరుస బంతుల్లో వీరిద్దరూ ఔట్ కావడం ఇంగ్లాండ్‌ను దెబ్బతీసింది. తర్వాత టస్కిన్ అహ్మద్ ఒకే ఓవర్లో మొయిన్ అలీ (9), బెన్ డకెట్ (11)ను పెవిలియన్ చేర్చాడు. సామ్ కర్రన్ కూడా కాసేపటికే ఔటయ్యాడు. తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేకపోవడంతోపాటు బంగ్లా ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉండటంతో ఇంగ్లాండ్ విజయానికి 16 పరుగుల దూరంలో నిలిచింది.
ఛత్తోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన బంగ్లాదేశ్.. ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండు టీ20ల్లో లక్ష్యాన్ని చేధించిన బంగ్లా పులులు.. చివరి మ్యాచ్‌లో లక్ష్యాన్ని కాపాడుకున్నారు. మూడో టీ20లో టస్కిన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతోపాటు.. ముష్ఫికర్ రహీమ్ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీయడం బంగ్లాదేశ్‌కు అనుకూలంగా మారింది.