Rajya Sabha praises Oscar wins: ఇది కూడా మీ ఖాతాలో వేసుకుంటారా? ఏంటి?
అనంతరం రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన రెండు సినిమాలు ఆస్కార్ (Oscar) గెలుచుకుని భారతదేశానికి గర్వకారణంగా నిలిచాయన్నారు. ఈ ఆస్కార్ గెలుపులను కూడా బీజేపీ తమ ఖాతాలో వేసుకోకూడదని ఖర్గే చమత్కరించారు. ‘‘ఆర్ఆర్ఆర్ (RRR) కు, ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers) కు ఆస్కార్ (Oscar) రావడానికి తాము, తమ నాయకుడు మోదీ కారణమని మాత్రం అనకండి. మేమే డైరెక్ట్ చేశాం. మేమే పాట రాశాం అనో.. లేకపోతే, మోదీజీ డైరెక్ట్ చేశారు.. మోదీజీ పాట రాశారు అనో చెప్పి క్రెడిట్ తీసుకోవద్దని కోరుతున్నా’’ అని బీజేపీపై సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ మాట్లాడుతూ, ఖర్గే సరదాగా చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డులను తొలగించాలని చూడకండి అని వ్యాఖ్యానించారు. ‘ఇది అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం’ అని జైరామ్ రమేశ్ అన్నారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers) డాక్యుమెంటరీని సభ్యులు కోసం ప్రదర్శించాలని, అలాగే, అన్ని పాఠశాలల్లో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలని సూచించారు.