Tuesday, March 21, 2023

ssy interest rate, SSY: ఆ స్కీమ్‌ డిపాజిటర్లకు కేంద్రం ఝలక్.. వడ్డీ రేట్ల పెంపు లేనట్లే? – will modi govt increase sukanya samriddhi yojana ssy account rate from april 1


SSY: సామాజిక భద్రతా పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ధి యోజనకు అత్యంత ప్రజాదారణ లభించింది. ఆడపిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. 10 ఏళ్లలోపు వయసు ఉన్న ఆడపిల్లలకు వారి పేరుతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచేందుకు అవకాశం కల్పంచారు. ఖాతా తెరిచిన రోజు నుంచి నెల వారీగా లేదా ఏడాదికోసారి 15 ఏళ్ల పాటు ఇందులో డిపాజిటే చేయాల్సి ఉంటుంది. ఈ డిపాజిట్లకు కేంద్ర ప్రభుత్వం స్థిరమైన వడ్డీని కల్పిస్తుంది. దానిని త్రైమాసిక పద్ధతిన సవరిస్తూ వస్తుంటుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దీంతో ఈసారి వడ్డీ రేట్ల పెంపు చేపట్టాలని ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తున్న కస్టమర్లు కోరుతున్నారు. అయితే, ఏప్రిల్ 1న కేంద్రం ఏ నిర్ణయం తీసుకోనుందనేది ఆసక్తి నెలకొంది.

ఈసారీ నిరేశేనా?
సుకన్య సమృద్ది యోజన (Sukanya samriddhi yojana ) ప్రవేశపెట్టిన తొలి నాళ్లలో మంచి వడ్డీ రేటును ఇచ్చేవారు. అయితే, ఇప్పుడు అంత ఇవ్వడం లేదు. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర ప్రభుత్వ పొదుపు పథకాలపై వర్తించ వడ్డీ రేట్ల కంటే ఎస్ఎస్‌వై అకౌంట్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే, గత 12 త్రైమాసికాల పాటు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం 7.6 శాతం మేర వడ్డీ కల్పిస్తోంది. అయితే 2023-24 ఆర్థిక ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కొత్త ఏడాది తొలి త్రైమాసికంలో సైతం సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని ఇటీవల జాతీయ మీడియా పేర్కొంది. అంటే మరో త్రైమాసికంలో కూడా నిరాశ తప్పదనే భావన నెలకొంది.

12 త్రైమాసికాలుగా మారని వడ్డీ రేటు..
202021 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంగా సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును 8.4 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దాంతో పాటే పీపీఎఫ్ వడ్డీ రేటును సైతం 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించారు. ఆ తర్వాత సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అదే వడ్డీ రేటు కొనసాగుతూ వస్తోంది. 2022, డిసెంబర్‌లో కొన్ని చిన్న సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను ప్రభుత్వం సవరించినప్పటికీ ఎస్ఎస్‌వై, పీపీఎఫ్ వంటి వాటి వడ్డీ రేట్లను మాత్రం ఎలాంటి సవరణ చేయలేదు.

సుకన్య సమృద్ధి యోజనలో కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ మొత్తం నగదుకు పన్ను మినహాయింపు పొందవచ్చు. గత 12 త్రైమాసికాల నుంచి ఎస్ఎస్‌వై వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఈ సుకన్య సమృద్ది యోజనకు మంచి ఆదరణ లభిస్తోంది. చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

Women’s Day Special: మహిళలకు స్పెషల్ ఆఫర్.. స్పెషల్ స్కీమ్.. అందరికన్నా ఎక్కువ వడ్డీ!SBI కన్నా ఎక్కువ వడ్డీ.. ఈ బ్యాంకులో డబ్బులుంటే అధిక లాభం.. మీకు అకౌంట్ ఉందా మరి?DCB Bank: బ్యాంకు కీలక ప్రకటన.. ఒకటి కాదు ఒకేసారి రెండు శుభవార్తలు.. ఏం నిర్ణయం తీసుకుందంటే?



Source link

Latest news
Related news