లోపాయికారీ ఒప్పందాలకు పవన్ స్పెషలిస్ట్ అని పేర్ని నాని విరుచుకుపడ్డారు. 2014 నుంచి 2023 వరకు పవన్ కళ్యాణ్ చరిత్ర, జనసేన బండారంపై కూర్చొని చర్చిద్దామా అని సవాల్ విసిరారు. తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబుతో పవన్ పోటీపడుతున్నారని దుయ్యబట్టారు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేందుకే పవన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని… చంద్రబాబు ప్రాపకం కోసమే ప్రభుత్వంపై పవన్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పవన్ సోషల్ ఇంజినీరింగ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని.. ఏ కులం ఏ జాబితాలో ఉందో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. ఏటా డిసెంబరులో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతిని ప్రజలంతా ఎంత సంబరంగా జరుపుకుంటారో.. అదే విధంగా తన పార్టీ ఆవిర్భావం కూడా సినిమా ఫంక్షన్ తంతుగా జరుపుకుంటున్నారని సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ కు అసలు సిద్దాంతాలే లేవని.. నిలకడ లేని రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జనసేన అని ఎద్దేవా చేశారు.
BREAKING NEWS