ఐపీఎల్ తరహాలో డబ్ల్యూపీఎల్‌ని కూడా హిట్ చేయాలని ఆశిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ దూరాన్ని 5 మీటర్లు తగ్గించిదట. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకి బౌండరీ లైన్ దూరాన్ని డీవై పాటిల్ స్టేడియంలో 70 మీటర్లు ఉంచుతారు. దాంతో.. డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌ల కోసం 65 మీటర్ల దూరంలో బౌండరీ లైన్ ఉంటుందని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా 60 మీటర్లకి బౌండరీ లైన్‌ని బీసీసీఐ కుదించేసింది. ఇటీవల ముగిసిన ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ -2022లో బౌండరీ లైన్‌ని 65 మీటర్ల దూరంలో ఉంచారు.
ముంబయి జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బంతుల్లోనే 14 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా.. ఓపెనర్ మాథ్యూస్ 31 బంతుల్లో 3×4, 4×6 సాయంతో 47 పరుగులు చేసింది. అలానే కేర్ కూడా 24 బంతుల్లో 6×4, 1×6 సాయంతో 45 పరుగులు చేసింది. కానీ.. గుజరాత్ జెయింట్స్ టీమ్‌లో హేమలత మాత్రమే రెండు సిక్సర్లతో ఫర్వాలేదనిపించింది. ఓవరాల్‌గా ముంబయి జట్టులో 31 ఫోర్లు, 2 సిక్సర్లు నమోదవగా.. గుజరాత్ టీమ్‌లో కేవలం ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లే నమోదయ్యాయి.
Read Latest Sports News, Cricket News, Telugu News