Sunday, April 2, 2023

Venkatesh Maha: KGFపై డైరెక్టర్ వెంకటేష్ మహ నీచ్ కమీన్ కుత్తే కామెంట్స్.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్‌

Venkatesh Maha – KGF: ఎవ‌రి పిల్ల‌లు వారికి ముద్దు ఇది అందరికీ తెలిసిన విష‌య‌మే. కాద‌న‌లేని స‌త్యం కూడా. అంత మాత్రాన ప‌క్క‌న వాళ్ల‌ని తిట్ట‌ట‌మో, విమ‌ర్శించ‌ట‌మో చేస్తే వాళ్లు ఊరుకోరు. ఎదురు దాడికి దిగుతారు. ఇప్పుడు ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ పాన్ ఇండియా రేంజ్‌లో స‌క్సెస్ సాధించిన KGF సినిమాపై ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో స‌ద‌రు సినిమాను ఇష్ట‌ప‌డిన అభిమానులు, నెటిజ‌న్స్ వెంక‌టేష్ మ‌హాను ఓ రేంజ్‌లో కామెంట్స్ రూపంలో ఏకీ పారేస్తున్నారు. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే..

ఓ యూ ట్యూబ్ ఇంట‌ర్వ్యూలో మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి, నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ‌, శివ నిర్వాణ‌, వెంక‌టేష్ మ‌హా పాల్గొన్నారు. ఇందులో ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా మాట్లాడుతూ ‘‘నేను సినిమా పేరు చెప్ప‌ను. కానీ ప్రపంచంలో ఏ తల్లి అయినా కొడుకుని గొప్పొడువి కావాలిరా అంటే బాగా సంపాదించి న‌లుగురుకి ఉప‌యోగ‌ప‌డు అని అర్థం. కానీ విష‌యంలో నాకొక ప్ర‌శ్న ఉండిపోయింది. అదేంటంటే త‌ల్లి కొడుకుతో అంత కావాల‌ని అంటుంది. నాకు ఆ మ‌హాత‌ల్లిని క‌ల‌వాల‌నుంది. ఆమె చెప్పిన‌ ఆ అంత‌ను త‌వ్వి తోడే వాళ్లు ఉంటారు. వీడెళ్లి వాళ్ల‌ను ఉద్ద‌రిస్తాడు. త‌ర్వాత ఓ పాట వ‌స్తుంది.

చివ‌రలో బంగారం అంతా తీసుకెళ్లి.. ఎంత నీచ్ క‌మీన్ కుత్తే కాక‌పోతే ఆడు.. వాళ్ల‌కి ఇందిర‌మ్మ ప‌థ‌కంలో ఇళ్లులిచ్చి మొత్తం తీసుకెళ్లి ఎక్క‌డో పార‌దొబ్బుతాడు.అలాంటి నీచ్ క‌మీన్ కుత్తే ఎవ‌రైనా ఉంటాడా? అలాంటి కుత్తే అవ‌మ‌ని త‌ల్లి అడిగితే, అలాంటి క‌థ‌ల‌ను మ‌నం సినిమాగా తీస్తే మ‌నం చప్ప‌ట్లు కొడుతున్నాం’’ అంటూ అన్నాడు. ఇదే ఇంట‌ర్వ్యూలో మ‌రో వ్య‌క్తి మాట్లాడుతూ త‌లా తోక లేని కాన్సెప్ట్ సినిమాల‌ను తీసుకొచ్చి హిట్స్ చేస్తున్నాం అన్నారు.

ఈ వాదన‌లో ఎక్క‌డా వెంక‌టేష్ మ‌హా సినిమా పేరు కానీ, ద‌ర్శ‌కుడు పేరు కానీ, న‌టీన‌టులు పేర్లు కానీ చెప్ప‌లేదు. అయితే త‌ను చెప్పిన దాని ప్ర‌కారం త‌ను KGF సినిమాపై ఘాటు కామెంట్స్ చేశాడ‌నే సుస్ప‌ష్టం. దీనిపై KGF ఫ్యాన్స్‌, య‌ష్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వెంక‌టేష్ మ‌హాపై ఘాటు కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇక ట్రోల‌ర్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. నువ్వు చేసిందే రెండు సినిమాలు..అందులో ఒక‌టి రీమేక్ అంటూ నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.

అయితే ఇదే ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న లేడీ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి జ‌రిగిన విష‌యంపై సారీ చెబుతూ ట్వీట్ చేశారు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిన ప్ర‌తీ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ అవుతుంది. క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌నాన్ని సానుకూలంగా చేయాల‌నే దానిపై పాజిటివ్‌గా జ‌రిగిన చ‌ర్చ‌. మ‌రొక‌రిని అవ‌హేళ‌న చేయ‌టం అనేది క‌రెక్ట్ కాదు. ఇందులో ఏదైనా త‌ప్పు జ‌రిగి ఉంటే క్ష‌మించ‌గ‌ల‌రు’’ అని నందినీ రెడ్డి పేర్కొన్నారు. మరి అసలు కామెంట్స్ చేసిన వెకటేష్ మహ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

ALSO READ: Amitabh Bachchan: Project Kషూటింగ్‌లో అమితాబ్ బచ్చన్‌కి ప్రమాదం.. గాయాలు

ALSO READ: ఖుష్బూకి లైంగిక వేధింపులు.. తండ్రిపై నటి సంచలన ఆరోపణలు

ALSO READ: Jr NTR – RRR: ఆస్కార్ కోసం అమెరికా బ‌య‌లు దేరిన ఎన్టీఆర్‌..వీడియో వైర‌ల్‌

ALSO READ: Sreeleela: అనాథ పిల్ల‌ల కోసం మంచి ప‌నిని స్టార్ట్ చేసిన శ్రీలీల‌.. నెటిజ‌న్స్ ప్రశంస‌లు

ALSO READ: Praveen Anumolu: ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ప్ర‌వీణ్‌ అనుమోలు క‌న్నుమూత

Latest news
Related news