Friday, March 24, 2023

sovereign gold bond 2023, Gold Bonds: బంగారంపై భారీ తగ్గింపు.. ఆఫర్ 5 రోజులే.. ఎలా కొనుగోలు చేయాలి? – sovereign gold bond scheme 2022 23 series 4 subscription opens today should you subscribe


Gold Bonds: బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రస్తుత రోజుల్లో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొనుగోలు చేయాలంటే ఓసారి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయొచ్చు. భారీ తగ్గింపుతో లభిస్తాయి. బంగారంపై ఇన్వెస్ట్ చేయడమన్నమాట. అంటే బంగారంతోనే సంపాదించొచ్చు. పసిడిపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి అందుబాటులో ఉన్న ఆకర్షణీయ స్కీమ్‌గా చెప్పొచ్చు. ఇదే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్- 2022-23 సిరీస్ 4 (Sovereign Gold Bond Scheme). కేంద్ర ప్రభుత్వ తరఫున వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయిస్తుంది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఈ ఏడాది తొలిసారి అవకాశం ఇస్తోంది ఆర్‌బీఐ.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఇవాళ్టి నుంచే అంటే మార్చి 6 సోమవారం నుంచే ప్రారంభం అవుతంది. అంటే మార్చి 6 నుంచి మార్చి 10 వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది. డిస్కౌంట్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి 5 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డిస్కౌంట్‌లో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారు వెంటనే త్వరపడండి మరి. ఈ క్రమంలో బంగారం ఎంతకు లభిస్తుంది. ఆఫర్ ఏమిటి గోల్డ్ బాండ్లను (Gold Bonds) ఎలా, ఎక్కడ కొనుగోలు చేయాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వారికి భారీ డిస్కౌంట్..
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022-23 సిరీస్ 4 సబ్‌స్క్రిపష్న్ ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతుంది. సోమవారం నుంచి 5 రోజులు అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ధర గ్రాముకు రూ.5,611గా నిర్ణయించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐతో చర్చలు జరిపి ఇన్వెస్టర్లు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే గ్రాముకు రూ.50 మేర డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. పేమెంట్స్ డిజిటల్ మోడ్‌లో చేసే వారికి ఇది వర్తిస్తుంది. ఇలా ఆన్‌లైన్, డిజిటల్ పద్ధతిలే కొనుగోలు చేసే ఇన్వెస్టర్లకు బంగారం గ్రాముకు రూ.5,561కే లభిస్తుంది.

ఎక్కడ ఈ బాండ్స్ కొనుగోలు చేయాలి?
సావరిన్ గోల్డ్ బాండ్లను గుర్తింపు పొందిన బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటేడ్, గుర్తింపు పొందిన పోస్టాఫీసులు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజిల ద్వారా కొనుగోలు చేయొచ్చు. పోస్టాఫీసుల విషయానికి వస్తే అన్నింట్లో ఈ అవకాశం ఉండదు. కొన్ని ఎంపిక చేసిన వాటిల్లోనే విక్రయిస్తారు.

లాకిన్ పీరియడ్ ఎంతుంటుంది?
ఈ సావరిన్ గోల్డ్ బాండ్ల టెన్యూర్ అనేది 8 ఏళ్లుగా ఉంటుంది. అయితే, 5 ఏళ్ల తర్వాత ప్రీమెచ్యూర్ రిడంప్సన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ బాండ్లు గ్రాముల ప్రాతిపదికన లభిస్తాయి. కనిష్ఠంగా ఒక గ్రాము నుంచి అందుబాటులో ఉంటాయి. మెచ్యూరిటీ పీరియడ్ 8 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే, ఒక వ్యక్తి 4 కిలోల వరకు మాత్రమే గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టొచ్చు. ట్రస్టుల వంటి వాటికి మాత్రం గరిష్ఠంగా 20 కిలోల వరకు అవకాశం ఉంటుంది.

లాభాలేంటి?
బంగారం ధర భవిష్యత్తులో పెరిగితే ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. వడ్డీ అందుతుంది. బంగారం ప్రస్తుత ధరకు కొనుగోలు చేసి ఎక్కువైన సందర్భంలో విక్రయించవచ్చు. గోల్డ్ బాండ్లపై తరుగు ఉండదు. చెల్లింపులు క్యాష్ రూపంలో ఉంటాయి. దొంగతనం జరుగుతుందన్న భయం ఉండదు. బ్యాంకుల్లో కూడా తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు. బంగారం రేటు తగ్గితే తప్ప పెద్ద నష్టాలేనవి ఏమీ ఉండవు.

ప్రస్తుతం బంగారం ధర ఎలా ఉంది?
ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.51,850 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు హైదరాబాద్‌లో రూ.56,550 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.56,550 వద్ద కొనసాగుతోంది.

Gold Jewellery Sale: గుడ్‌న్యూస్.. ఆ బంగారు ఆభరణాలపై నిషేధం.. వచ్చే నెల నుంచి అమ్మకాలు బంద్Gold Rate Today: బంగారం కొనాలనేవారికి అలర్ట్.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే.. తులం ఎంతంటే?



Source link

Latest news
Related news