Adani Row: అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ జనవరి 24న సంచలన రిపోర్ట్ వెలువరించిన విషయం తెలిసిందే. మార్కెట్లో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని, షేరు విలువను కృత్రిమంగా పెంచుకుంటూ వెళ్తూ ఇన్వెస్టర్లను మోసం చేసిందని రిపోర్ట్ విడుదల చేసింది. అయితే.. ఇప్పుడు ఈ అదానీ వ్యవహారం సుప్రీం కోర్టు దృష్టికి కూడా వెళ్లింది. ఈ వ్యవహారంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు.. ఇదే సమయంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని కూడా విచారణ జరిపి 2 నెలల్లో రిపోర్ట్ తమకు అందించాలని ఆదేశించింది. అయితే.. ఇప్పుడు సెబీ తీరుపై RBI మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పలు ప్రశ్నలు సంధించారు.
అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి.. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అంశాల్లోని మూల వివరాలను ఇంతవరకు సెబీ ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు రఘురాం రాజన్. ఇక అదానీ కంపెనీల్లో షేర్ల కొనుగోలు కోసమే.. తమ 690 కోట్ల డాలర్లు.. భారత కరెన్సీలో సుమారు రూ.56,600 కోట్ల నిధుల్లో 90 శాతం ఇన్వెస్ట్ చేసి.. ట్రేడింగ్ చేస్తున్న 4 మారిషస్ ఫండ్ల యజమానులు ఎవరు అనే.. వివరాలు సెబీ దగ్గర ఎందుకు లేవని ప్రశ్నించారు. ఆ నాలుగు కంపెనీలు ఎలారా ఇండియా అపార్చునిటీస్ ఫండ్, క్రిస్టా ఫండ్, అల్బులా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ల యాజమాన్యాలపై తనకు సందేహాలున్నాయని చెప్పారు. అయితే.. ఇందుకోసం ఇప్పుడు సెబీ.. నిఘా, పరిశోధనా సంస్థల సాయాన్ని తీసుకుంటుందేమో అని ఆయన అన్నారు.
RBI Imposes Penalty: మరో సహకార బ్యాంక్‌పై RBI కొరడా.. SBI కంటే ఎక్కువ వడ్డీ ఇస్తుందనే కారణంతో..!
Mukesh Ambanis Driver: ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వారందరి కంటే ఎక్కువ.. ఐటీ ఉద్యోగులకు మించి..!
అదానీ గ్రూప్.. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి పెద్ద మొత్తంలో మార్కెట్ విలువను కోల్పోయిన సంగతి తెలిసిందే. సుమారు 150 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్ పతనమైంది. ఇప్పుడిప్పుడే మళ్లీ అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కోలుకుంటున్నాయి. ఇక వచ్చే ఏడాదిలో అదానీ గ్రూప్.. 200 కోట్ల డాలర్లు భారత కరెన్సీలో రూ.16,400 కోట్ల వరకు విలువైన విదేశీ కరెన్సీ బాండ్లను చెల్లించాల్సి ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
Bill Gates: భారత్‌పై బిల్‌గేట్స్ ప్రశంసల జల్లు.. PM Modi ని కలిశాక మరింత ఆశతో ఉన్నానంటూ ట్వీట్!