మహిళలకు పని ప్రదేశంలో సాధికారత కల్పించడం ప్రాధాన్యం అర్థం చేసుకున్నట్లు చెప్పారు చింగారి కో ఫౌండర్, సీఈఓ సుమిత్ ఘోష్. వారికి మరింత మద్దతు కల్పించేందుకు, వారు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు మరింత సహకరించనున్నట్లు దానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇక మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా.. చింగారి ఉమెన్స్ బైక్ ర్యాలీ కూడా నిర్వహించనుంది.
ఇక మహిళలకు పీరియడ్స్ సమయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరికి కేవలం అసౌకర్యంగానే ఉండొచ్చని.. ఇంకొందరికి విపరీతమైన నొప్పి ఉంటుందంట. కళ్లు తిరుగుతాయని ఇంకా వేరే డిజార్డర్స్ ఉంటే బాధ భరించలేకుండా ఉంటుందని, అప్పుడు మహిళలకు విశ్రాంతి అవసరమని వైద్యులు అంటున్నారు.
ఇక ఇప్పటికే పీరియడ్స్ సమయంలో మహిళలు నెలకు ఒక రోజు సెలవు తీసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ప్రకటించింది. అంతకుముందు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో.. 2020లో మహిళలకు పీరియడ్ లీవ్స్ ఇచ్చింది. తర్వాత 2021లో స్విగ్గీ కూడా మహిళలకు నెలకు 2 రోజులు టైమ్ ఆఫ్ ప్రకటించింది. బైజూస్ కూడా ఇదే బాటలో నెలకు ఒక రోజు సెలవు ఇస్తోంది.
నిజం చెప్పాలంటే భారత దేశంలో పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడుకునేటు వంటి పరిస్థితులు ఇప్పటికీ లేవు. బట్టలకు మరకలు అంటుకుంటాయని భయం, శానిటరీ నాప్కిన్స్ కొనాలంటే మొహమాటం, అదేదో రహస్యం అన్నట్లు మెడికల్ షాప్స్‌లో వాటిని నల్లని కవర్‌లో చుట్టివ్వడం ఇలా ఎన్నో కారణాలుంటాయి. ఇంకా ఒక అధ్యయనం ప్రకారం.. భారత్‌లో 71 శాతం యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలకు పీరియడ్స్ వచ్చే వరకు దాని గురించి తెలియకపోవడం గమనార్హం.
- Read Latest Business News and Telugu News