Sunday, April 2, 2023

IND vs AUS 4th Test : నాలుగో టెస్టుకి పిచ్‌పై క్లారిటీ ఇచ్చేసిన అహ్మదాబాద్ క్యూరేటర్!

భారత్, ఆస్ట్రేలియా మధ్య (India vs Australia ) అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా మార్చి 9 నుంచి జరగనున్న నాలుగో టెస్టుకి ఎలాంటి పిచ్‌‌ని క్యూరేటర్ ఇవ్వబోతున్నారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులో పిచ్ స్పిన్‌కి అనుకూలించగా.. భారత జట్టు లబ్ధి పొంది విజయం సాధించింది. ఆ తర్వాత ఇండోర్ పిచ్‌పై విపరీతంగా బంతి తిరడంతో అనూహ్యంగా పర్యాటక ఆస్ట్రేలియా లబ్ధి పొందింది. దాంతో నాలుగో టెస్టుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

సాధారణంగా భారత్ గడ్డపై టెస్టు మ్యాచ్ అనగానే స్పిన్ పిచ్‌లు దర్శనమిస్తుంటాయి. కానీ.. ఇండోర్ పిచ్‌కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పూర్ రేటింగ్ ఇవ్వడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పునాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వరల్డ్‌లోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్‌కి కూడా ఒకవేళ పూర్ రేటింగ్ వచ్చి డీమెరిట్ పాయింట్లు వస్తే? వన్డే ప్రపంచకప్‌-2023 మ్యాచ్‌లకి ఆతిథ్యమిచ్చే అవకాశం చేజారుతుంది. ఈ నేపథ్యంలో నార్మల్ పిచ్‌ని సిద్ధం చేయాలని క్యూరేటర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ (జీసీఏ)కి ఇప్పటి వరకూ బీసీసీఐ నుంచి పిచ్‌పై ఎలాంటి సూచనలు రాలేదట. దాంతో రిస్క్ తీసుకోకూడదని క్యూరేటర్ భావిస్తున్నారు. ‘‘పిచ్ తయారీపై భారత జట్టు మేనేజ్‌మెంట్, బీసీసీఐ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సూచనలు రాలేదు. దాంతో నార్మల్ పిచ్‌ని రెడీ చేస్తున్నాం’’ అని క్యూరేటర్ తెలిపారు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news