Sunday, April 2, 2023

holi festival, Stock marketకు హోలీ సెలవు ఏ రోజు? మార్చి 7 లేదా 8.. అయోమయంలో ఇన్వెస్టర్లు! – indian stock market holiday when market trading will closed for holi festival march 7 or 8


Stock market holiday: ఈ వారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ఒక రోజు తక్కువగానే ఉండనుంది. ఎందుకంటే దేశ వ్యాప్తంగా హోలీ పండక సెలబ్రేషన్లు ఉన్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింటిలో హోలీ సెలవు (Holi Festival) ఉంటుంది. అయితే, దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరోజు హోలీ వేడుకలు ఉన్నందున ఇన్వెస్టర్లు అయోమయంలో పడిపోయారు. ఏ రోజున స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుందనే విషయంపై క్లారిటీ లేదు. అయితే, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో మార్చి 7న హోలీ పండగ సెలవుగా ఉంది. అయితే, స్టాక్ బ్రోకర్స్ అసోసియే,న్ మాత్రం ఈ హోలీ పండగ సెలవును మార్చాలని కోరుతోంది. దీంతో మార్చి 7నే సెలవు ఉంటుందా? లేక మార్చి 8కి మారుస్తారా? అనే అయోమయం నెలకొంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మార్చి 7న ఈక్విటీ, ఈక్విటి డెరివేటివ్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోవింగ్ విభాగాల్లో ట్రేడింగ్ జరగదు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్, జాతీయ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ రెండింటిలోనూ మార్చి 7న సెలవుగా ప్రకటించారు. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సైతం మార్చి 7నే హోలీ పండగ సెలవు దినంగా వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అయితే, స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ (ANMI) మాత్రం హోలీ సెలవును మార్చాలని ప్రభుత్వం, ఎక్స్చేంజీలు, సెబీని కోరుతోంది. మార్చి 7వ తేదీకి బదులుగా మార్చి 8వ తేదీన సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు అయితే మార్కెట్లకు హోలీ సెలవులో ఎలాంటి మార్పు లేదు. అయితే బ్రోకర్స్ అసోసియేషన్ వినతిని పరిగణనలోకి తీసుకున్నట్లయితే మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం మంచిది. అయితే, ఇప్పటికయితే మార్కెట్లు మార్చి 7నె మూతపడతాయి.

సాధారణంగా మార్కెట్లు వారానికి ఐదు రోజులు ట్రేడింగ్ కొనసాగిస్తాయి. డీఫాల్ట్‌గా శనివారం, ఆదివారాల్లో వీకెండ్ హాలీడేస్‌. ఈ వారం మార్కెట్లు మార్చి 7, మార్చి 11, మార్చి 12 మూడు రోజులు మూసి ఉండనున్నాయి. ట్రెండింగ్ కేవలం మార్చి 6, 8, 9, 10 తేదీల్లో మాత్రమే అనుమతిస్తారు. గత వారం మార్కెట్లు ఒక్కసారిగా పెరిగి మంచి లాభాలతో ముగిశాయి. అదానీ బ్లాక్ డీల్స్‌తో విదేశీ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. సెన్సెక్స్ 1.3 శాతం, నిప్టీ 0.9 శాతం మేర పెరిగింది. మరోవైపు.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా మార్చిలో 7, 8వ తేదీల్లో బ్యాంక్ సెలవులుగా పేర్కొంది. రాష్ట్రాల్లోని ఉత్సవాలను బట్టి హోలీ సెలవులను మార్చింది.

Holi Festival 2023 అక్కడ హోలీ పండుగ వేళ రంగులకు బదులు లాఠీ దెబ్బలు.. ఏయే రాష్ట్రాల్లో ఎంత విభిన్నంగా జరుపుకుంటారంటే…EMI మరింత భారం.. Home Loan వడ్డీ రేట్లు పెంచిన దిగ్గజ బ్యాంక్.. రేపటి నుంచే అమలు!Adani సంక్షోభంపై సుప్రీం కోర్టు కోరిన 7 అంశాలు ఇవే!.. వీటికి సమాధానం దొరికేనా?EPF: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో భారీ కోత!



Source link

Latest news
Related news