Friday, March 31, 2023

benefits of pan aadhaar link, 25 రోజులే గడువు.. Aadhaar-PAN లింక్‌ చేస్తే లాభమేంటి? ఇవి తెలుసుకోండి! – aadhaar pan link deadline nears what are benefits of linking these two identity proofs


Aadhaar-PAN Link: ప్రస్తుత రోజుల్లో ఆర్థిక లావాదేవీలకు పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) ఎంతో కీలకంగా మారింది. ఈ క్రమంలో 12 అంకెల బయోమెట్రిక్ నంబర్ ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆదాయపు పన్ను శాఖ తెలపింది. గడువు సైతం దగ్గరపడుతోంది. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ (Income Tax department) మార్గదర్శకాల ప్రకారం మార్చి 31, 2023 నాటికి పాన్-ఆధార్ లింక్ చేయాలి. ఎవరైతే లింక్ చేయకపోతే వారి పాన్ కార్డు ఏప్రిల్ 1 నుంచి పని చేయదని స్పష్టం చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. పాన్-ఆధార్‌ (Aadhaar) లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుండొచ్చు. ఆధార్‌తో పాన్‌ లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు కేవైసీ పూర్తి చేసేందుకు ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కీలకంగా మారింది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్స్ సులభంగా దాఖలు చేసేందుకు వీలు పడుతుంది. వీటితో పాటు ఇంకా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం వ్యక్తులకు ఆదాయపు పన్ను శాఖ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) కేటాయిస్తోంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. జులై 1, 2017 నుంచి కార్డులు జారీ చేస్తోంది. ఆధార్ నంబర కలిగి ఉన్న వారు తప్పనిసరిగా సూచినం విధంగా ఫామ్‌లో నింపి అందించాలని సూచిస్తోంది. ఇచ్చిన గడువులోపు పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాలని స్పష్టం చేసింది.

ప్రయోజనాలు ఏమిటి?

  • ఆధార్ కార్డు అనేది అన్ని లావాదేవీలకు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఆధార్ – పాన్ కార్డు అనుసంధానించడం ద్వారా అన్ని ట్రాన్సాక్షన్లను ఆడిట్ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖకు సులభంగా మారుతుంది.
  • కొత్త ఆర్థిక ఏడాది ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆధార్-పాన్ లింక్ చేసే వరకు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అనుమతించరు.
  • ఐటీఆర్ ఫైలింగ్ సులభతరమవుతుంది. ట్రాన్సాక్షన్ల రిసిప్టులు, ఇ-సిగ్నేచర్ వంటివి ఐటీ డిపార్ట్‌మెంట్‌కు అందించాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ ఆధార్ ఇ-వెరిఫికేషన్ ద్వారా ఆటోమెటిక్‌గా జరిగిపోతాయి.
  • ఆధార్-పాన్ లింక్ చేయడం వల్ల రెండో రద్దును నిరోధించడంలో సహాయపడుతుంది.
  • ఆధార్ కార్డు వినియోగంలోకి రావడంతో ఇతర డాక్యుమెంట్లు పెద్దగా అవసరం ఏర్పడదు.
  • ఆధార్ కార్డు ఒక గుర్తింపు కార్డుతో పాటు అడ్రస్ ప్రూఫ్‌గానూ ఉపయోగపడుతుంది.
  • మరోవైపు.. ఆధార్ కార్డును తీసుకురావడం వల్ల ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేయడం ప్రభుత్వానికి సులభమైపోయింది. ఇప్పుడు ఆధార్ ఆధారిత అథెంటికేషన్ అనేది తప్పనిసరి.
  • ఆధార్-పాన్ లింక్ చేయడం ద్వారా వ్యక్తులపై ఉన్న ఇతర పాన్ కార్డుల సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు. పన్ను ఎగ్గొట్టే వారిని ఈజీగా గుర్తించవచ్చు. పాన్ కార్డు ద్వారా జరిగే మోసాల నుంచి బయటపడొచ్చు. మీ పేరుపై ఎవరైనా ఆధార్ తీసుకుంటే అది రద్దయిపోతుంది.

గతంలో ఆధార్ – పాన్ కార్డు లింక్ గడువు మార్చి 31, 2022 వరకే ఉండేది. దీనిని జూన్ 30, 2022 వరకు ఆలస్య రుసుము రూ.500తో పొడిగించారు. ఇప్పుడు దానిని మార్చి 31, 2023 వరకు ఆలస్య రుసుము రూ.1000తో పొడిగించారు. ఇదే చివరి అవకాశంగా అధికారులు చెబుతున్నారు. ఇంకా ఎవరైన అనుసంధానం చేయనట్లయితే రూ.వెయ్యి చెల్లించి వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.

వారికి ఊరట.. PAN-Aadhaar లింక్ తప్పనిసరి కాదు.. ఈ జాబితాలో మీరున్నారా?Financial Tasks: మార్చి 31 వరకే గడువు.. ఈ పనులు చేయకుంటే నష్టపోతారు!UIDAI కొత్త టెక్నాలజీ.. Aadhaar అక్రమాలను ఇట్టే పట్టేయొచ్చు.. వేలిముద్రల గుర్తింపులో కృత్రిమ మేధ!



Source link

Latest news
Related news