వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌కు మళ్లీ నోటీసులు(MINT_PRINT)
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ మరోమారు నోటీసులు జారీ చేసింది. నేడు విచారణకు రావాలని నోటీసులివ్వగా ముందస్తు కార్యక్రమాలతో రాలేనని అవినాష్ తెలిపారు. దీంతో ఈ నెల 10వ తేదీన విచారణకు రావాలని సిబిఐ మరో నోటీసు జారీ చేసింది. అవినాష్ రెడ్డి తండ్రికి సైతం నోటీసులిచ్చింది.
నదుల అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ సమావేశం..
హైదరాబాద్‌లోని జలసౌధలో నదుల అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ సమావేశం జరుగనుంది. సమావేశంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొననున్నారు. నదుల అనుసంధానంపై జాతీయ నీటిఅభివృద్ధి సంస్థ టాస్క్‌ఫోర్స్ చర్చించనుంది.
కోనసీమ జిల్లాలో గంజాయి విక్రయాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ముమ్మిడివరంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అమలాపురం బైపాస్ రోడ్డులో మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. మొత్తం 34 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‍కు తరలించారు.
లోకేష్‌కు కొడాలి నాని సవాలు
నారా లోకేష్‌ను మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. చంద్రబాబు, లోకేశ్‍కు దమ్ముంటే గుడివాడ, గన్నవరం నుంచి పోటీ చేయాలన్నారు. వైసీపీకి పోటీగా లోకేశ్ యువగళం సభ పెట్టాలన్నారు. యువగళం సభకు పోటీగా సిద్ధార్థ్ రెడ్డిని పంపుతామని, యువగళం సభ కన్నా సిద్ధార్థరెడ్డి సభకు పది రెట్లు యువత ఎక్కువ రాకుంటే రాజకీయాలు వదిలేస్తానని మాజీమంత్రి కొడాలి నాని సవాలు చేశారు.
వైద్య ఆరోగ్య శాఖపై సిఎం సమీక్ష
వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సమీక్ష జరుగనుంది. వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష మంత్రి రజనితో పాటు వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
36వ రోజుకు చేరిన పాదయాత్ర
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 36వ రోజుకి చేరింది. ఉదయం 9 గంటలకు వేపులబయలులో బీసీ నేతలతో లోకేశ్ భేటీ కానున్నారు. సాయంత్రం 5.15 గంటలకు కలికిరిలో రైతులతో లోకేశ్ భేటీ అవుతారు.