గ్రేస్ హ్యారీస్‌తో పాటు అర్ధశతకంతో రాణించిన కిరణ్ నవ్‌గిరే (53 పరుగులు, 43 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) యూపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో సోఫీ (22 పరుగులు, 12 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడటంతో యూపీ వారియర్స్ అద్భుత విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ 46 పరుగులు (32 బంతుల్లో, 7 ఫోర్లు) చేయడంతో ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. సబ్బినేని మేఘన 24 (15 బంతుల్లో, 5 ఫోర్లు) పరుగులు, ఆష్లీన్ గార్డెనర్ 25 (19 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశారు.హేమలత 21 (13 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో గుజరాత్ గెలుపు ఖాయమే అనిపించింది. చివరి ఓవర్లలో గ్రేస్ హ్యారీస్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. యూపీ వారియర్స్ జట్టు బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్ చెరో 2 వికెట్లు తీయగా.. తాహిలా మెక్‌గ్రాత్, అంజలి చెరో వికెట్ పడగొట్టారు.
గుజరాత్ జెయింట్స్ అమ్మాయి కిమ్ గార్త్ 5 వికెట్లు పడగొట్టగా.. అన్నాబెల్ సుథర్‌లాండ్, మాన్సీ జోషీ తలో వికెట్ తీశారు. గ్రేస్ హ్యారీస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. ఈ టోర్నీలో గుజరాత్ జెయింట్స్‌కు ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది.