Friday, March 31, 2023

WPL 2023: ముంబయి కెప్టెన్ బౌండరీల వర్షం.. గుజరాత్ టార్గెట్ 208

Gujarat Giants vs Mumbai Indians : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ – 2023 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లోనే భారీ స్కోరు నమోదైంది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో.. గుజరాత్ జెయింట్స్‌పై టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ టీమ్ 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (65: 30 బంతుల్లో 14×4) బౌండరీల వర్షం కురిపించేసింది. గుజరాత్ టీమ్‌లో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ముంబయి ఇండియన్స్ ఫస్ట్‌లోనే ఓపెనర్ యస్తిక భాటియా (1) వికెట్ చేజార్చుకుంది. కానీ.. మరో ఓపెనర్ హేలీ మాథ్యూ (47: 31 బంతుల్లో 3×4, 1×6) దూకుడుగా ఆడేయగా.. ఆమెకి బ్రంట్ (23: 18 బంతుల్లో 5×4) సహకారం అందించింది. కానీ.. హర్మన్‌ప్రీత్ రాకతో ముంబయి స్కోరు పరుగులు పెట్టింది. వరుస బౌండరీలు బాదిన హర్మన్‌ప్రీత్ కౌర్ నెం.5 బ్యాటర్ కేర్ (45 నాటౌట్: 24 బంతుల్లో 6×4, 1×6)తో కలిసి నాలుగో వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

కానీ.. టీమ్ స్కోరు 166 వద్ద హర్మన్‌ప్రీత్ కౌర్‌ని స్నేహ్ రాణా ఔట్ చేయగా.. ఆ తర్వాత వచ్చిన పూజా వస్త్రాకర్ (15: 8 బంతుల్లో 3×4)తో కలిసి కేర్ దూకుడుగా ఆడేసింది. దాంతో ముంబయి ఇండియన్స్ 200 పరుగుల మార్క్‌ని అందుకోగలిగింది.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news