Thursday, March 30, 2023

World Obesity Day 2023: పిల్లల్లో ఊబకాయం సమస్యకు ప్రధాన కారణాలు ఇవే..! – these foods increase obesity in kids

రేపు ‘ప్రపంచ స్థూలకాయ దినోత్సవం’. ప్రతి సంవత్సరం మార్చి 4న ప్రపంచ స్థూలకాయ దినోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఊబకాయం గురించి చర్చిండానికి, దీనిపై అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 1975 నంచి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది, కాబట్టి దీని గురించి ఆవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఊబకాయం సమస్య.. పెద్దల్లోనే కాదు, చిన్నారులలోనూ ఎక్కువ అవుతోంది. WHO ప్రకారం, 2020లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 39 మిలియన్ల పిల్లలు.. స్థూలకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువుతో బాధపడే పిల్లల దేశాల జాబితాలో ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానంలో ఉంది. ఇటీవల చేపట్టిన అధ్యయనం ప్రకారం దేశంలో 14.4 మిలియన్ల పిల్లలు అధికబరువుతో ఉన్నట్లు తేలింది. పిల్లల్లో ఊబకాయం కారణంగా గుండె సమస్యలు, నిద్రపోయినప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, కీళ్ల సమస్యలు, డయాబెటిస్‌ ముప్పు పెరుగుతుంది. అంతేకాకుండా, పెద్దైన తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారులు అధిక బరువు పెరగకుండా.. చూసుకోవడం చాలా ముఖ్యం.

చిన్నారులలో ఊబకాయానికి కారణాలు..

చిన్నారులలో ఊబకాయానికి కారణాలు..

తగినంత శారీరక శ్రమ లేకపోవటం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోవటం చిన్నారులలో ఊబకాయానికి కారణం అవుతాయి. పిల్లల్లో ఊబకాయానికి ప్రధాన కారణం వారు తీసుకునే ఆహారం. ఫాస్ట్ ఫుడ్, జంక్‌ ఫుడ్‌, పోషక విలువలు లేని ఆహారం, కేలరీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు అధికంగా పెరిగిపోతున్నారు. కొవ్వు, కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం.. పిల్లల్లో స్థూలకాయానికి ప్రధాన కారణం. పిల్లుల్లో అధిక బరువుకు కారణం అయ్యే.. ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఫాస్ట్‌ ఫుడ్‌..

ఫాస్ట్‌ ఫుడ్‌..

పిజ్జా అంటే ఇష్టపడని వారుండరు. పిల్లలకైతే.. ఫేవరెట్‌ ఫుడ్‌ టాప్‌ లిస్ట్‌లో ఉంటుంది. దీన్ని చాలా రకాల కూరగాయలు, చికెన్, మటన్‌ టాపింగ్స్‌, గోధుమ పిండి బేస్‌తో తయారు చేస్తారు. ఇది చూడటానికి హెల్తీగా ఉన్నా.. దీన్ని తయారు చేయడానికి వాడే చీజ్‌ కారణంగా బరువు తర్వగా పెరుగుతారు. అదేవిధంగా బర్గర్లు, హాట్‌ డాగ్స్‌, ప్యాటీస్ వంటి ఫాస్ట్‌ ఫుడ్స్‌లో ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. మీ పిల్లలకు ఇవి తినే అలవాటు ఉంటే.. వెంటనే మానిపించాలి. (image source – pixabay)

ఆలూ చిప్స్‌..

ఆలూ చిప్స్‌..

పిల్లల ఫేవరట్‌ ఫుడ్స్‌లో ఆలూ చిప్స్‌ ఒకటి. కానీ, ఈ చిప్స్‌లో అధిక కేలరీలు, ఉప్పు అసంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తాయి. (image source – pixabay)

స్వీట్స్‌..

స్వీట్స్‌..

క్యాండీలు, డెజర్ట్‌లు, చాక్లెట్‌లు పిల్లలకు ఇష్టమైన ఫుడ్స్‌. చాలా మంది అమ్మలు పిల్లలను మారం ఆపడానికి చాక్లెట్స్‌ లంచం ఇస్తూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటి. పిల్లుల స్వీట్స్‌, చాక్లెట్స్‌ ఎక్కువగా తింటే.. పళ్లు పుచ్చిపోతాయి, అలాగే.. అధిక బరువుకు కూడా దారి తీస్తుంది.

ఐస్‌క్రీమ్‌‌‌‌‌‌‌..

ఐస్‌క్రీమ్‌‌‌‌‌‌‌..

వేసవికాలం స్టార్ట్‌ అయ్యింది. ఈ హాట్‌హాట్‌ సమ్మర్‌లో కూల్‌ కూల్‌ ఐస్‌ క్రీమ్‌ను పిల్లలు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. పేరెంట్స్‌ కూడా వారికి ఐస్‌క్రీమ్స్‌ ఎంతో ఇష్టంగా కొనిపెడుతూ ఉంటారు. కానీ, ఇది మంచి అలవాటు కాదు. ఐస్‌క్రీమ్‌లో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. గ్లైసెమి‌క్ ఇండెక్స్‌ కూడా అధికంగా ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ పిల్లల బరువును పెంచేస్తాయి. మీ చిన్నారులకు ఐస్‌క్రీమ్‌ ఇష్టమైతే.. మీ ఇంట్లోనే‌ షుగర్‌ ఫ్రీ, లో క్యాలరీ ఐస్‌క్రీమ్‌ తయారు చేసి ఇవ్వండి. (image source – pixabay)

నూడుల్స్‌..

నూడుల్స్‌..

నూడుల్స్‌ అంటే పిల్లలకే కాదు, పెద్దలకు ఇష్టమే. అయితే, మీ పిల్లలకు నూడుల్స్‌ పెట్టడం అంత మంచిది కాదు. వీటిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇవి అధిక బరువుకు కారణం అవుతాయి. (image source – pixabay)

Also Read: పిల్లలు ఇవి తింటే ఈజీగా సన్నబడతారు..!

పండ్ల రసాలు..

పండ్ల రసాలు..

పిల్లలకు చాలా మంది తల్లిదండ్రులు.. టెట్రా ప్యాక్‌లలో వచ్చే ఫ్రూట్‌ జ్యూస్‌లు, ప్రాసెస్డ్‌ ఫ్రూట్‌ జ్యూస్‌లు ఇస్తూ ఉంటారు. వీటిలో చక్కెర స్థాయిలు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి వారి బరువును పెంచుతాయి. వీటికి బదులుగా వాళ్లకు.. తాజా పండ్ల రసాలు ఇవ్వండి. వీటిలో ఫైబర్‌, పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి మీ పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఈ ఆహార పదార్థలను మీ చిన్నారులకు పూర్తిగా దూరం చేయవలసిన అవసరం లేదు. వారికి అప్పుడప్పుడు ట్రీట్‌లుగా ఇవ్వండి. కానీ, అలవాటుగా మాత్రం చేయకండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news