Tuesday, March 21, 2023

software developers, Software: సాఫ్ట్‌వేర్ డెవలపర్ల అడ్డగా మన హైదరాబాద్.. వరల్డ్ టాప్-10లో చోటు.. కేటీఆర్ ట్వీట్! – hyderabad city ranks among top 10 cities for hiring software developers in 2023


Software: ఐటీ రంగంల పరిశ్రమలకు సాఫ్ట్‌వేర్ డెవలపర్లే కీలకం. మూల స్తంభాలుగా సంస్థలను నడిపిస్తారు. కోడింగ్, ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయడం, అప్లికేషన్లలో సమస్యలు ఎదురైనప్పుడు సత్వరమే పరిష్కరించడం వంటి పనులు సాఫ్ట్‌వేర్ డెవలపర్లు (Software Developers) చూస్తుంటారు. ఇలా ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ప్రస్తుత రోజుల్లో ఎంతో కీలకంగా మారారు. అయితే, ఇటువంటి సాఫ్ట్‌వేర్ డెవలపర్ల నియామకాల్లో మన హైదరాబాద్ (Hyderabad City) నగరం అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ల నియామకలు అత్యధికంగా జరుగుతున్న నగరాల్లో టాప్-10లో నిలిచింది. కరత్.కామ్ (Karat.com) అనే హ్యూమన్ రీసోర్సెస్ సర్వీస్‌ల సంస్థ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.

సాఫ్ట్‌వేర్ డెవలపర్ల నియామకాలు 2023లో ఏ విధంగా ఉన్నాయనే అంశంపై పరిశోధన చేసింది కరత్.కామ్ సంస్థ. ఈ క్రమంలో అమెరికాలోని వివిధ నగరాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత నియామకాలు జరుగుతున్న ఐటీ కంపెనీలు భారత్‌లోనే ఉండడం విశేషం. మన దేశంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గురుగావ్, పుణె, ముంబాయి నగరాల్లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ల నియామకలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటిల్లో మన హైదరాబాద్ ప్రపంచంలోనే టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకంగా నగరంగా నిలిచింది.

సాఫ్ట్‌వేర్ డెవలపర్ల నియామకాల్లో టాప్-10 నగరాలు..

  1. సింగపూర్
  2. టోక్యో
  3. వాంకూవర్
  4. టొరొంటో
  5. సియాటిల్ మెట్రో ఏరియా
  6. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా
  7. న్యూయార్క్ సిటీ
  8. బోస్టన్
  9. లండన్
  10. హైదరాబాద్

హైదరాబాద్‌లో ప్రధానంగా పైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, టెలికామ్ వంటి రంగాలకు సాఫ్ట్‌వేర్ సర్వీసులను అందిస్తున్న ఐటీ కంపెనీలు మన నగరంలో అధికంగా ఉండడం వల్లే ఈ రికార్డ్ సాధ్యమైంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ల నియామకాలు అధికంగా చేపడుతున్న దేశాల్లో అమెరికా, భారత్‌తో పాటు జపాన్, సింగపూర్, కెనడా, యూకే ఉన్నాయి. అయితే మన భారత్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ల సంఖ్య చాలా ఎక్కువ. దీంతో పాటు ఖర్చులు తక్కువగా ఉండడం వల్ల మన దేశంలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఐటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. దీని ద్వారా అవకాశాలు పెరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో 8 లక్షలకుపైగా ఉద్యోగులు

సాఫ్ట్‌వేర్ రంగంలో హైదారబాద్ దూసుకెళ్తోంది. ఈ రంగంలో మన నగరంలో 8 లక్షల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.1.83 లక్షల కోట్లు సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరిగాయి. గడిచిన ఏడేళ్లలో ప్రతి ఏటా 15 శాతానికిపైగా వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది. మెరుగైన మౌలిక సదుపాయాలు, టెక్ ఎకో సిస్టమ్ అభివృద్ధి వంటివన్నీ ఐటీ రంగంలో హైదరాబాద్‌ను టాప్‌లో నిలబెడుతున్నాయి.

కేటీఆర్ ట్వీట్..

సాఫ్ట్‌వేర్ డెవలపర్ల నియామకాల్లో ప్రపంచంలోనే మన హైదరాబాద్ టాప్-10లో నిలిచిన క్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు. ‘ సాఫ్ట్‌వేర్ డెవలపర్ల నియామకాలు అధికంగా జురుగుతున్న నగరాల్లో మన హైదరాబాద్ ప్రపంచంలోనే టాప్ 20 నగరాల్లో స్థానం సంపాదించింది. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతికి ఇది ఎంతో ప్రత్యేక గుర్తింపు. ‘ అని పేర్కొన్నారు.

లేఆఫ్స్ వేళ గుడ్‌న్యూస్.. భారత IT Sector నియామకాల్లో జోష్.. ఎగిరిగంతేస్తున్న ఫ్రెషర్స్!‘ఐ’ అంటే ఇండియా.. ‘టీ’ అంటే తైవాన్.. ఐటీకి కేటీఆర్ కొత్త నిర్వచనంలేఆఫ్స్ వేళ గుడ్‌న్యూస్.. IT Company భారీగా ఉద్యోగాల ప్రకటన.. వారికే అధిక ప్రాధాన్యం!



Source link

Latest news
Related news