Tuesday, March 21, 2023

Saif Ali Khan: ‘రండి.. మా బెడ్‌ రూమ్‌లోకి వచ్చి ఫొటోలు తీసుకోండి’.. మీడియాపై సైఫ్ ఫైర్!

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలబ్రెటీలు ఫ్యాన్స్, మీడియాపై కోపంగా వ్యవహరించిన వీడియోలు చాలానే వచ్చాయి. తాజాగా హీరో సైఫ్ అలీ ఖాన్, తన భార్య కరీనా కపూర్‌లకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో సైఫ్ వెటకారంగా అన్న మాటలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

రండి లోపలికి వచ్చి

మలైకా అరోరా తల్లి పుట్టినరోజు వేడుకలకు హాజరై గురువారం రాత్రి కరీనా- సైఫ్ తిరిగి తమ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో వీళ్లిద్దరినీ ఫోటోగ్రాఫర్‌లు ఫాలో అవుతూ సర్ ఒక ఫొటో ప్లీజ్ అంటూ కోరారు. కానీ అటు కరీనా, ఇటు సైఫ్ ఇద్దరూ దీనిపై స్పందించలేదు. దీంతో మళ్లీ మళ్లీ అడిగేసరికి సైఫ్ అలీ ఖాన్ కాస్త వెటకారంగా సమాధానమిచ్చాడు. “ఒక పని చేయండి, మా బెడ్‌రూమ్‌కు వచ్చి తీసుకోండి” అన్నాడు.

ఈ మాటలతో స్టన్ అయిన రిపోర్టర్లలో ఒకరు “సైఫ్ సర్.. మీరంటే మాకు చాలా ఇష్టం” అన్నాడు. దీనికి సైఫ్, “మాకు కూడా మీరంటే ఇష్టం”అని చెప్పి డోర్ క్లోజ్ కరీనాను తీసుకుని లోపలికి వెళ్లిపోయాడు.

నెటిజన్ల రియాక్షన్

ఈ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వెరైటీగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది సైఫ్ చెప్పిన మాటలు నిజమే.. కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సెలబ్రెటీలకు కూడా వాళ్ల పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇంటి ముందుకు వెళ్లి మరీ ఇలా చేయకూడదు అంటున్నారు. మరి కొందరు మాత్రం.. సెలబ్రెటీలకు ఆ హోదా, ప్రచారం కల్పిస్తుంది మీడియా కదా.. అలాంటి వాళ్లపై వెటకారం ఆడాల్సిన అవసరం ఏముందంటన్నారు.

కానీ ఉదయం లేచిన దగ్గరి నుంచి జిమ్, రెస్టారెంట్, ఇల్లు, పార్టీలు.. ఇలా సెలబ్రెటీలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి మీడియా కవర్ చేస్తూనే ఉంటుంది. దీంతో మీడియా అంటే సెలబ్రెటీలకు అలుసైపోయిందంటూ మరి కొంతమంది అంటున్నారు. ఇలా సైఫ్ మరి సరదాగా అన్నాడో లేక సీరియస్‌గా చెబుదామని వెటకారం చేశాడో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం తెగ తిరుగుతోంది.

ఆది పురుష్

ఇక కెరీర్ విషయానికొస్తే సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం అటు హీరోగా ఇటు విలన్‌గా విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ రాముడిగా నటిస్తోన్న ‘ఆది పురుష్’ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అయితే సైఫ్.. రావణుడి గెటప్‌పై పెద్ద దుమారమే రేగింది. రావణుడికి గడ్డం ఉండటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి.

Latest news
Related news