208 పరుగుల ఛేదనలో గుజరాత్ జెయింట్స్ టీమ్ ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ బెత్ మూనీ (0: 3 బంతుల్లో) గాయం కారణంగా ఫస్ట్‌లోనే రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగింది. కానీ.. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించిన ఓపెనర్ సబ్బినేని మేఘన (2: 4 బంతుల్లో) ఓ పేలవ షాట్‌తో వికెట్ చేజార్చుకోగా.. అనంతరం వచ్చిన హర్లీన్ డియోల్ (0), గార్డెనర్ (0), అన్నాబెల్ (6), గ్రేషియా (8), స్నేహ్ రాణా (1), తనూజ (0) వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు. దాంతో నిమిషాల్లోనే 23/7తో నిలిచిన గుజరాత్ టీమ్ ఓటమిని ఖాయం చేసుకుంది. అయితే.. మిడిల్ ఓవర్లలో కాసేపు వికెట్ల పతనాన్ని హేమలత (29 నాటౌట్: 23 బంతుల్లో 1×4, 2×6) అడ్డుకుంది. కానీ.. ఆమెకి మాన్షీ జోషి (6), మోనికా పటేల్ (10) నుంచి పెద్దగా సహకారం లభించలేదు.
అంతక ముందు ముంబయి జట్టులో హర్మన్‌తో పాటు ఓపెనర్ మాథ్యూస్ (47: 31 బంతుల్లో 3×4, 4×6) దూకుడుగా ఆడేసింది. అలానే కేర్ (45 నాటౌట్: 24 బంతుల్లో 6×4, 1×6) కూడా ఆఖరి వరకూ క్రీజులో ఉండి ముంబయి జట్టుకి మెరుగైన స్కోరుని అందించింది. లాస్ట్ బాల్‌కి క్రీజులోకి వచ్చిన వాంగ్.. సిక్స్‌తో ముంబయి ఇన్నింగ్స్‌ని ముగించడం విశేషం.
Read Latest Sports News, Cricket News, Telugu News