Sunday, April 2, 2023

Ippatam Issue : సైకోతత్వంతోనే కూల్చివేతలు.. ఇప్పటం ఇష్యూపై ప్రతిపక్షాలు ఫైర్

గుంటూరు జిల్లా మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఇప్పటం గ్రామంలో శనివారం అధికారులు ఇళ్ల కూల్చివేతలు చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. నిబంధనలు అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారంటూ …. 12 గృహాల ప్రహరీలు, ర్యాంపులు, మెట్లు తొలగించారు. గ్రామస్తుల తీవ్ర నిరసనల మధ్యే నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. అధికారుల చర్యలకు నిరసనగా.. గ్రామంలోని స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి , ఆందోళన చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జనసేన ఆవిర్భావ సభ ఇప్పటంలో జరిగిన నాటి నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుందని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రామానికి రవాణా సౌకర్యం లేదని… బస్సులు రావని, భారీ వాహనాలు ఇక్కడ నుంచి వెళ్లవని పేర్కొంటున్న గ్రామస్తులు… రోడ్డు విస్తరణ చేసి ఏం చేసుకుంటారని నిలదీస్తున్నారు. కేవలం కక్ష్య సాధింపు కోసం నిర్మాణాలు కూల్చివేస్తున్నారని మండిపడుతున్నారు.

Source link

Latest news
Related news