ఇక కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌ఛార్జి వరుపుల రాజా గుండెపోటుతో చనిపోయారు. శనివారం రాత్రి ఉన్నట్టుండి ఆయనకు గుండె దగ్గర నొప్పి రావడంతో ఆయన్ను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా.. ఆయన కన్నుమూశారు. రాజా హఠాన్మరణంతో.. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. వరుపుల రాజా ప్రస్తుతం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన… ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. శనివారం కూడా ప్రచారం చేసి సాయంత్రానికి సొంతూరైన ప్రత్తిపాడు వెళ్లారు. ఆ తర్వాత కూడా బిజీగా గడిపారు. పార్టీ కార్యకర్తలు, బంధువుల మాట్లాడుతూ ఉండగా… రాత్రి 8 తర్వాత గుండె దగ్గర నొప్పి వచ్చింది. వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
BREAKING NEWS