Tuesday, March 21, 2023

Global Investment Summit :కీలక సమయంలో సమ్మిట్‌ నిర్వహించాం – సీఎం జగన్

Global Investment Summit Updates 2023: విశాఖ వేదికగా తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రెండవ రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఎంవోయూలపై సంతకాలతో ప్రారంభమైంది. 10.30 గంటలకు ప్రముఖ ఇండో అమెరికన్‌ మ్యుజీషియన్‌ కర్ష్‌ కాలే బ్యాండ్‌ ప్రదర్శన పూర్తి అయింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడారు. శనివారం మొత్తం 8 రంగాలపై సెషన్లు ఉండనున్నాయి. తొలి రోజు శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు రూ.11,87,756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Source link

Latest news
Related news