పెట్టుబడులను ఆకర్షించిన రంగాలలో…. ఇంధన, పరిశ్రమలు – వాణిజ్యం, ఐటి – ఐటిఈఎస్, పర్యాటక, వ్యవసాయం – పశుసంవర్ధక శాఖలు ఉన్నాయి. ప్రధాన పెట్టుబడిదారులలో, రిలయన్స్ రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది, దీని ద్వారా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రూ. 2,35,000 కోట్ల పెట్టుబడితో 77,000 మందికి ఉపాధి కల్పించే 3 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. JSW గ్రూప్ 9,500 మందికి ఉపాధి కల్పించే రూ. 50,632 కోట్ల పెట్టుబడితో 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఏబీసీ లిమిటెడ్ రూ. 1.20 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని 7000 మందికి ఉపాధిని కల్పించనుంది. అరబిందో గ్రూప్ రూ. 10,365 కోట్ల పెట్టుబడితో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ద్వారా 5,250 మందికి ఉపాధి లభించనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 21,820 కోట్ల పెట్టుబడితో 14,000 మందికి ఉపాధి కల్పించే 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్ తో రూ. 9,300 కోట్ల పెట్టుబడితో 2, 850 మందికి ఉపాధి కల్పించే 2 ఎంఓయూలు కుదిరాయి. జిందాల్ స్టీల్ రూ. 7,500 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి కల్పించే ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
BREAKING NEWS