ఏడాది క్రితం భారత్ ప్రతి సంవత్సరం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు (Crude Oil Imports) వాటా 0.2 శాతం మాత్రంగానే ఉండేది. కానీ, ఫిబ్రవరి 2023, నాటికి అది రోజుకు 16 లక్షల పీపాలకు చేరింది. 2022, నవంబర్‌లో రోజుకు 9,09,403 బ్యారెళ్లు, అక్టోబర్‌లో 9,35,556 బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి అయ్యింది. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి సౌదీ, ఇరాక్‌లను వెనక్కి నెట్టి రష్యా అతిపెద్ద దేశంగా నిలిచింది. భారత్ దిగుమతి (India Oil Imports) చేసుకుంటున్న ఆయిల్‌లో ఒక్క రష్యా నుంచే 35 శాతం వస్తోంది.
రష్యా చమురు ధరలపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్క బ్యారెళ్ 60 డాలర్ల కంటే తక్కువగా లభిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న భారత్ రష్యా నుంచి దిగుమతులను మరింత పెంచింది. ప్రపంచంలో చమురు ఎక్కువగా వినియోగించుకుంటున్న దేశాల్లో భారత్ మూడోది. తమ అవసరాల్లో 85 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి అవుతోంది. వోర్టెక్సా డేటా ప్రకారం 2023, ఫిబ్రవరిలో ఇరాక్ నుంచి రోజుకు 9,39,921 బ్యారెళ్లు, సౌదీ నుంచి 6,47,813 పీపాలు, యూఏఈ నుంచి 4,04,570 పీపాలు, అమెరికా నుంచి 2,48,430 పీపాలు ముడి చమురు భారత్‌కు దిగుమతి అయ్యింది. సౌదీ నుంచి చమురు దిగుమతులు 16 శాతం, అమెరికా నుంచి 38 శాతం తగ్గిపోయాయి.
- Read Latest Business News and Telugu News
Also Read: LPG Cylinder: వంట గ్యాస్ ధరల మంట.. నాలుగేళ్లలో 56 శాతం పెంపు.. సబ్సిడీలో భారీ కోత!