Bamboo crash barrier: మహారాష్ట్రలో తొలిసారి..
మహారాష్ట్రలో చంద్రపూర్, యావత్మల్ జిల్లాలను కలిపే వణి – వరొరా హైవే (Vani-Warora Highway) పై 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బ్యారియర్స్ (bamboo crash barrier) ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఒదొక అసాధారణ ప్రయోగమని కొనియాడారు. ఈ వెదురు క్రాష్ బ్యారియర్ (bamboo crash barrier) ఉక్కుకు సరైన ప్రత్యామ్నాయమని, అలాగే, పర్యావరణానికి, వెదురు (bamboo industry)) పరిశ్రమకు ప్రయోజనకరమని వివరించారు. ప్రపంచంలోనే ఇలా వెదురుతో క్రాష్ బ్యారియర్స్ (bamboo crash barrier) తయారు చేయడం మొదటి సారని వెల్లడించారు. ఆత్మ నిర్బర్ భారత్ కు ఇదొక అద్భుత నిదర్శనమని ట్వీట్ చేశారు.