Sunday, April 2, 2023

Allu Arjun: అల్లు అర్జున్ కోసం మాస్ టైటిల్ ఫిక్స్ చేసి సందీప్ వంగా!

Allu Arjun – AA 23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా వ‌రుస సినిమాల‌ను ట్రాక్ ఎక్కించే ప‌నిలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఆయ‌న అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రీసెంట్‌గానే వ‌చ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్‌తో బ‌న్నీ చేతులు క‌ల‌ప‌టంపై బ‌న్నీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. అయితే సినిమా 2024లో స్టార్ట్ అవుతుంద‌ని, 2025లో రిలీజ్ అవుతుంద‌ని అన్నారు.

ఈ నేప‌థ్యంలో AA 23 గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అదేంటంటే సినిమా టైటిల్.. సందీప్ రెడ్డి వంగా త‌న సినిమాల‌ను ఇన్‌టెన్స్‌గా తెర‌కెక్కిస్తుంటారు. అదే ఇంటెన్సిటినీ టైటిల్స్ నుంచే చూపించాల‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. అందులో భాగంగానే AA 23కి భ‌ద్ర‌కాళి అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే కొంద‌రు మాత్రం ఈ వార్త‌లో నిజం లేద‌నే అంటున్నారు. ఎందుకంటే సినిమా లాక్ మాత్ర‌మే అయ్యింది. ఇంకా సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నే లేదు. ఇలాంటి స‌మ‌యంలో టైటిల్ ఫిక్స్ అయ్యింద‌న‌టం క‌రెక్ట్ కాద‌నేది వారి వాదన‌. ఎవ‌రి డిస్క‌ష‌న్ పాయింట్ వారి ద‌గ్గ‌రున్న‌ప్ప‌టికీ భ‌ద్ర‌కాళి అనే టైటిల్ మాత్రం చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంద‌ని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.

అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం పుష్ప 2 మూవీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల‌వుతుంద‌ని టాక్‌. మ‌రో వైపు సందీప్ రెడ్డి వంగాని గ‌మ‌నిస్తే త‌ను ఇప్పుడు ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో యానిమల్ సినిమా చేస్తున్నారు. అది పూర్తి కాగానే.. ప్ర‌భాస్ 25వ చిత్రం స్పిరిట్‌ను తెర‌కెక్కిస్తారు. దాని త‌ర్వాతే అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. అయితే ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు వినిపించాయి.

ALSO READ: Dil Raju: ‘బలగం’ డైరెక్టర్‌ని లాక్ చేసిన దిల్ రాజు

Latest news
Related news