Friday, March 31, 2023

WPL 2023 Schedule | రేపటి నుంచే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మ్యాచ్‌లు.. టైమింగ్స్ ఇవే

భారత్ గడ్డపై శనివారం నుంచే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Womens Premier League) -2023 (డబ్ల్యూపీఎల్ -2023) మ్యాచ్‌లు ప్రారంభంకాబోతున్నాయి. టోర్నీలో మొత్తం ఐదు జట్లు పోటీపడుతుండగా.. మార్చి 4 నుంచి మార్చి 26 వరకూ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకి, రాత్రి 7:30 గంటలకి స్టార్ట్‌ అవుతాయి. అన్ని మ్యాచ్‌లనూ ముంబయిలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించబోతోంది.

డబ్ల్యూపీఎల్ -2023 సీజన్‌‌ 18 రోజుల పాటు జరగనుండగా.. మొత్తం 22 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇందులో డబుల్ హెడర్ మ్యాచ్‌లు నాలుగు మాత్రమే. మార్చి 4 నుంచి మార్చి 21 వరకూ లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మార్చి 24న ఎలిమినేటర్, మార్చి 26న ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. ముంబయిలోని డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియంలోనే మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి.

టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రూపంలో ఐదు జట్లు పోటీపడబోతున్నాయి. ప్రతి జట్టూ లీగ్ దశలో ఎనిమిదేసి మ్యాచ్‌లను ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుండగా.. రెండు, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో పోటీపడుతుంది.

ముంబయి ఇండియన్స్ టీమ్‌ని కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నడిపించనుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికైంది. అలానే ఢిల్లీ క్యాపిటల్స్‌కి మెక్ లానింగ్, గుజరాత్ టైటాన్స్‌కి బెత్ మూనీ, యూపీ వారియర్స్‌కి హీలీ కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యారు. శనివారం జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్లు రాత్రి 7:30 గంటలకి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది. డబ్ల్యూపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు వయాకామ్ 18‌ ఛానల్‌లో ప్రసారంకానున్నాయి. ఆన్‌లైన్‌లో జియో సినిమా లేదా స్పోర్ట్స్ 18 టీవీలో వీక్షించొచ్చు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news