KS Bharat: రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌కు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కింది. తొలి మూడు టెస్టుల్లో వికెట్ల వెనుక ఆకట్టుకునే ప్రదర్శన చేసిన భరత్.. వికెట్ల ముందు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చలేకపోయాడు. దీంతో నాలుగో టెస్టులో భరత్‌ను తప్పించాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. అతడు ఆడింది మూడు మ్యాచ్‌లే కాబట్టి మరో అవకాశం ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు.