ఏపీలో మున్సిపల్ అధికారులు కేవలం ఒక్క ఇప్పటం గ్రామంలోనే పనిచేస్తున్నారా అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని అనేక చోట్ల అక్రమ కట్టడాలు ఉన్నాయని వాటిని తొలగించకుండా, అనేక సంవత్సరాలుగా నివాసం ఉండే వారిపై కక్ష పెంచుకుని తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో 70 అడుగుల రోడ్డు అవసరం లేదని అంటున్నారు. గతేడాది జనసేన ఆవిర్భావ సభ ఇప్పటంలో జరిగిన నాటి నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుందని విమర్శిస్తున్నారు. గ్రామానికి రవాణా సౌకర్యం లేదని… బస్సులు రావని, భారీ వాహనాలు ఇక్కడ నుంచి వెళ్లవని పేర్కొంటున్న గ్రామస్తులు… రోడ్డు విస్తరణ చేసి ఏం చేసుకుంటారని నిలదీస్తున్నారు. కేవలం కక్ష్య సాధింపు కోసం నిర్మాణాల కూల్చివేస్తున్నారని మండిపడుతున్నారు.
BREAKING NEWS